
ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్లో ఉందంటే మనషుల కంటే శరవేగంగా వ్యూస్, పాపులారిటీ సంపాదించేసుకుంటున్నాయి. వాటి ఆదాయాలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అచ్చం మనుషుల్లాగా కనిపించే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న ప్రభంజనం మాములుగా లేదు. అందులోనూ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ఆర్జిస్తున్నారో తెలిస్తే కంగుతింటారు. దీనిపై గ్రాండ్ వ్యూ రీసెర్చ్ జరిపిన సర్వే ప్రకారం.. ఈ విభాగంలో మార్కెట్ ఆదాయంలో 68% వాటా మహిళల రూపంలో ఉండే "ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల"దే నని తేలింది. మానవ ఇన్ఫ్లుయెన్సర్ కంటే వీరు సుమారు 40 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లలో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 44.76% ఉన్నారు. ఇది సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ ఖాతాల ఫాలోవర్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు. అంతేకాదండోయ్ ఈ ఏఐ మహిళా అవతార్లతో అనేక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌస్‌లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయట. మరి ఆ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో చూద్దామా..!. బ్రెజిలియన్ మ్యాగజైన్ 'లూయిజా' సృష్టించిన వర్చువల్ స్టార్ ‘లూ డో మగలు’ వార్షిక ఆదాయం సుమారుగా ₹25 కోట్లు. ఆమెకు ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారట. ‘లూ మిక్వేలా’ అనే మహిళా వర్చువల్ స్టార్‌తో ప్రాడా, కాల్విన్ క్లైన్ వంటి ఫ్యాషన్ హౌస్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 150 కోట్లు. గులాబీ రంగు జుట్టు కలిగిన స్పానిష్ ఏఐ మోడల్ ‘ఐటానా లోపెజ్’ అమెజాన్ స్పెయిన్, జియెసెలిన్ వటి బ్రాండ్లతో స్కాలర్షిప్ అందుకుంటోంది. ఆమె వార్షిక ఆదాయం రూ. 1 కోటిని మించి ఉంటుందట. భారత్‌లో ఏఐ