
‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న రిలీజ్ కానున్న ఈ మూవీపై శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఆలస్యం కావడం వెనుక ప్రేక్షకులే కారణమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందాలన్న తపనతో ఎక్కడా రాజీ పడకుండా తీయడం వల్లే ఖర్చులు, కాల్షీట్లు పెరిగాయని చెప్పారు. ‘దసరా’ సమయంలో బిజినెస్ లెక్కలు తెలియవని, కానీ ఇప్పుడు అంచనాలు పెరగడంతో మరింత బాధ్యతగా పనిచేశానని వెల్లడించారు.




