
చికెన్‌తో ఎప్పుడూ ఒకేలాంటి కర్రీలు, ఫ్రైలు చేసుకుని ఏం తింటాం? ఈసారి ఈ ఆఫ్గానీ చికెన్ ట్రై చేయండి. క్రీమీగా, స్పైసీగా, మసాలా ఫ్లేవర్‌తో ఉండే ఈ చికెన్ రెసిపీ... పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ లాగించేస్తారు. ఇందులో వాడే పదార్థాల వల్ల రెస్టారెంట్ స్టైల్ రుచిని ఇంట్లోనే ఇస్తుంది. ఇంకేందుకు ఆలస్యం...రెసిపీ చూసేద్దాం. చికెన్ – 500 గ్రాములు, పెరుగు – ½ కప్పు, ఫ్రెష్ క్రీమ్ – 3 టేబుల్ స్పూన్లు, కాజూ – 10 నుంచి 12, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్, మిరియాల పొడి – 1 టీస్పూన్, గరం మసాలా – ½ టీస్పూన్, ధనియాల పొడి – ½ టీస్పూన్, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు, వెన్న – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా పోయేలా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో చికెన్ ముక్కలను వేసి మసాలా మొత్తం పట్టేలా కలపాలి. కనీసం 30 నిమిషాలు మారినేట్ చేయాలి. మరింత రుచిగా కావాలంటే ఫ్రిజ్‌లో 2–3 గంటలు ఉంచుకోవచ్చు. కాజూను కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కాజూ పేస్టే ఆఫ్గానీ చికెన్‌కు మంచి క్రీమీ టెక్చర్, రిచ్‌నెస్ ఇస్తుంది. ఇప్పుడు మంచి మందపాటి కళాయిలో నూనె, వెన్న వేసి వేడి చేయాలి. మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై అన్ని వైపులా బాగా వేయించాలి. చికెన్ మీద మచ్చలు వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే తినేటప్పుడు టెండర్‌గా