
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో తమతో సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా వస్తుందని ఇప్పటి వరకూ ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్ (Bangladesh Cricket Team) జట్టుకు షాక్ తగిలింది. బంగ్లా పర్యటనకు వెళ్లడం లేదని భారత్ పరోక్షంగా చెప్పింది. సెప్టెంబర్‌లో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నిన్న అఫ్గాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ చెప్పినట్లుగానే దిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్ (IND vs AFG) జరగనుంది. అఫ్గాన్ జట్టుకు దిల్లీ హోం గ్రౌండ్‌గా వ్యవహరించనుంది. గత జూన్‌లో భారత్ - అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ‘‘భారత క్రికెట్ బోర్డు ఎల్లవేళలా అఫ్గానిస్థాన్‌కు బాసటగా ఉంటుంది. అఫ్గాన్ క్రికెట్ వృద్ధి కోసం మద్దతు ఇస్తాం. అత్యున్నత స్థాయిలో పోటీపడేలా వారికి అవసరమైన సదుపాయాలను కల్పిస్తాం. అందులో ద్వైపాక్షిక సిరీస్‌లూ ముఖ్యమైన భాగమే. నాణ్యమైన జట్లతో ఆడటం వల్ల వెలకట్టలేని అనుభవం వస్తుంది. భారత్‌తో (Team India) టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్‌ను ఆహ్వానిస్తున్నాం’’ అని బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తెలిపారు. ‘‘భారత్ వేదికగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇస్తోన్న సిరీస్‌కు బీసీసీఐ మద్దతు ఇస్తోంది. మైదానంలో ఇరు జట్ల మధ్య పోరు చాలా ఆసక్తికరం. నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. భారత్‌లోనూ అఫ్గాన్ ఆటగాళ్లకు అభిమానులు ఉన్నారంటే వారి ఆటతీరే కారణం. ఇటీవల ఒక టెస్టు, వన్డే సిరీస్ జరిగింది. మూడు ఫార్మాట్లలోనూ ఇరు జట్లు తలపడేందుకు ఉన్న అవకాశాలను ఏమాత్రం వదులుకోం’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devjit Saikia) స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా