
ఇంద్రవెల్లి: ఓ వ్యక్తి ఆవును దొంగలించిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయన్న విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి మండలం భీంనగర్ కాలనీకి చెందిన ఆచార్య సులోచన ఇంట్లో గత నెల 30న రాత్రి వారి ఆవును కొట్టంలో కట్టేశారు. రోజూలాగే ఉదయం లేచి ఆవును మేతకు తీసుకేళ్లెందుకు కొట్టంలో వెళ్లగా అక్కడ ఆవు కనిపించకపోవడంతో సులోచన, ఆమె కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాలను వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారన్నారు. ఆవు కోసం గాలింపు చర్యలు చేపట్టగా నార్నూరు మండలం తాడిహత్నూర్ గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ రామేశ్వర్ ఆవును దొంగలించి గుడిహత్నూర్కు తీసుకెళ్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు అతడిని హిరాపూర్ గ్రామ సమీపంలో అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి ఉట్నూర్ కోర్టులో హజరుపర్చగా అతనికి 14 రోజుల రిమైండ్ విధించినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు