
ఆదిలాబాద్ సాంస్కృతికం: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటన గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కనక విలాస్(36) మంగళవారం ఉదయం ఇంటి స్లాబ్‌కు నీళ్లు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగ తగలింది. దీంతో ఆయన స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విలాస్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.