
ఎదులాపురం: గత 14 ఏళ్లుగా నిరంతరాయంగా సత్యసాయి ట్రస్ట్ అన్నదానం కార్యక్రమం కొనసాగించటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సత్యసాయి నిత్యాన్నదాన కార్యక్రమం 14వ వార్షికోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యసాయి చిత్రపటానికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ట్రస్ట్ పలు రకాల సామాజిక కార్యక్రమాలతో పాటు అనునిత్యం నిరుపేద రోగుల సహాయకులకు అన్నదానం చేస్తూ వారి ఆకలి తీర్చటం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో రిమ్స్ సంచాలకుడు డాక్టర్ రాథోడ్ జైసింగ్ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.