
ముథోల్: విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం బాసర ఐఐఐటీలోని సమావేశ మందిరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటి) హైదరాబాద్ భాగస్వామ్యంతో నిర్వహించిన సెమీకండక్టర్ డిజైన్లపై ఐదు రోజుల ప్రత్యేక వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందరర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెమీకండక్టర్ తయారీ, డిజైనింగ్లకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేలా విద్యా బోధన సాగాలని సూచించారు. విద్య పూర్తికాకముందే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా తగిన అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వర్సిటీ వీసీ గోవర్ధన్, ఎన్ఐఈఎల్ఐటీ హైదరాబాద్ ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్ కొర్ర, ఓఎస్డీ మురళీ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు