
ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు(పీఈటీ) డా.ఖాసిం తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా క్రీడాధికారులు దయానంద్ రెడ్డి, పార్థసారథి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఆదిలాబాద్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఫుట్ బాల్ కిక్కింగ్, స్పిన్నింగ్ అంశాల్లో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్న మొదటి పీఈటీగా ఘనత సాధించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.