
ముధోల్: చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఘటనలూ చూస్తుంటాం. ఇలాంటి ఘటన నిర్మల్ జిల్లా ముద్గల్ గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన మధుకర్ ముధోల్లోని అత్తగారింటికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో అదుపుతప్పి ముందు ఉన్న టవేరా వాహనాన్ని ఢీకొని కిందపడ్డిపోయాడు. అయితే, హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కేవలం కాళ్లు, చేతులకు తీవ్ర గాయాయ్యాయి. గాయాలైన మధుకర్‌ను 108 వాహనంలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై బిట్ల పెర్సిస్ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. హెల్మెట్ ధరించి ఉండకపోతే ప్రాణాలు కోల్పోయే వారని అన్నారు. అందుకే ప్రతి ద్విచక్రవాహనుదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.