
ఆదిలాబాద్ అర్బన్: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను భాజపా నాయకులు అవమానించారని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో పలు వీధుల మీదుగా పాదయాత్ర చేపట్టారు. అంబేద్కర్ కూడలి ఎదుట నోటికి నల్లగుడ్డలు పెట్టుకుని సత్యాగ్రహ దీక్ష చేశారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. మల్లిఖార్జున ఖర్గే రాంలీల మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తరువాత భాజాపా నాయకులు ఆ వేదికను శుద్ధి చేయడం అంటరానితనం, అవమానకరం అని ఖండించారు. దీక్షలో పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, అడ్డి భోజారెడ్డి, సంజీవరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.