
ఇంద్రవెల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలు కన్న సమాజ నిర్మాణానికి ప్రతి సమతా సైనిక దళ సభ్యుడు కృషి చేయాలని దక్షిణ భారతదేశ సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు వాగ్మారే దీపక్ అన్నారు. సమతా సైనిక్ దళ్, అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్వర్యంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. పలువురు వక్తలు మాట్లాడారు. బుద్దుడి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంభించాలన్నారు. రాజ్యాంగ రక్షణతో పాటు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మహేందర్, రోహన్ బోధి, కిశోర్, అవినాష్ దిగ్విజయ్, రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.