
ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు బుధవారం ముగిశాయి. ముగింపు రోజు జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు రామ్ కిషన్ శాస్త్రి స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ కిషన్ శాస్త్రి తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక ఉద్యమాలు చేశారని, ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు వేల ఎకరాల భూమిని పేదలకు పంచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నళిని రెడ్డి, రాములు, షేక్ పాషా, అమీనా ఖాన్, సురేష్, రమేష్, షబానా ఖాన్ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.