
నటుడు సురేష్ తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలు, పరిశ్రమపై తన వ్యక్తిగత దృక్పథాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కెరీర్లో వచ్చిన విరామం గురించి ప్రశ్నించగా, అది ఇండస్ట్రీ ఇచ్చినది సగం, తాను స్వచ్ఛందంగా తీసుకున్నది సగం అని వివరించారు. చివరి సన్నివేశంలో కనిపించి శుభం కార్డు వేయడానికి ఉపయోగపడే రబ్బర్ స్టాంప్ పాత్రలు తనకు ఇష్టం లేవని స్పష్టం చేశారు. ఒక సినిమాలో తాను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయలేనప్పుడు, ఆ పాత్ర చేయాల్సిన అవసరం లేదని భావించేవాడినని చెప్పారు. మొదటి నుంచి పని తక్కువ ఉన్న హీరో పాత్రల కంటే, పని ఎక్కువ ఉన్న విలన్ పాత్రల పట్ల ఎక్కువ ఆసక్తి చూపానని సురేష్ పేర్కొన్నారు. పరిశ్రమలో తోటి నటులతో తన స్నేహ సంబంధాలపై మాట్లాడుతూ, జగపతిబాబు, సుమన్, శ్రీకాంత్, ఉత్తేజ్ వంటి వారితో తనకు చక్కటి అనుబంధం ఉందని తెలిపారు. ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే.. ముఖ్యంగా జెడి చక్రవర్తి గురించి ప్రస్తావిస్తూ, తనను ఫ్రాడ్ 420 అని చనువుగా పిలుస్తానని, వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక స్నేహాన్ని వివరించారు. జెడి చక్రవర్తి స్వభావం చాలా ప్రత్యేకమైనదని, అతని మనసులో ఏముందో అంచనా వేయడం కష్టమని, అతనికి కూడా తెలియదేమో అని సరదాగా అన్నారు. జెడితో తను ఏదైనా మాట్లాడగలనని, అతను తనతో ఏదైనా చెప్పగలడని, ఎందుకంటే ఇద్దరూ అంత స్పోర్టివ్‌గా తీసుకుంటారని తెలిపారు. ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల విజయాలను తన సమకాలికుల పోటీగా కాకుండా, వారి పుణ్యం, కర్మ ఫలితంగా చూస్తానని సురేష్ వివరించారు. పెద్ద ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన అందరూ విజయం సాధించలేరని, అందుకు దాసరి