లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు 1250కి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇటీవల కాలంలో సినిమాలు కాస్త తగ్గించిన బ్రహ్మానందం.. 'కామెడీ కింగ్'గా, 'మీమ్ గాడ్'గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎలాంటి వివాదాలు లేకుండా సినీ ప్రయాణం సాగించిన బ్రహ్మానందంపై, ఆయన సొంత అన్నయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.''వృద్ధాప్యంలో తమ్ముడి ప్రేమ, అనురాగం కోసం ఎదురు చూస్తున్న బ్రహ్మానందం అన్నయ్య'' అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''మేము ఆరుగురం అన్నదమ్ములం. ఐదోవాడు బ్రహ్మానందం. నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. ఇక్కడ నేను ఒంటరిగా మిగిలిపోయను. బ్రహ్మానందం ఎప్పుడైనా ఫోన్ చేసి పలకరిస్తాడేమో అని ఎదురు చూస్తున్నా. హైదరాబాద్ నుంచే, ఆయనకు షూటింగ్ లేనప్పుడైనా ఒక్కసారి అయినా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. 'రేయ్ అన్నయ్యా.. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావ్?' అని అడుగుతాడేమో అని అడగొచ్చు కదా అని అనుకుంటాను'' అని అన్నారు.''గొప్పవాళ్ళు పలకరించినప్పుడు నాలాంటి చిన్నవాళ్లకు సంతోషంగా ఉంటుంది. చనువుగా మాట్లాడటానికి బాగుంటుంది. మనకు మనంగా వాళ్ల దగ్గరకు వెళ్తే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. వాడు ఏదో అంటాడని కాదు కానీ, నాకు అలాంటి ఫీలింగ్ ఉంది. నాకు బాధేమీ లేదు కానీ.. 'ఎలా ఉన్నావ్ అన్నయ్యా?' అని ఒక్క మాట అడిగితే చాలు అనేదే నా బాధ. నాకు డబ్బులేమీ అక్కర్లేదు. ప్రేమగా పలకరిస్తే చాలు. అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇటీవల మా ఊరికి వచ్చాడంట. నాకు తెలియదు. అయినా నేను వెళ్లలేను. ఎందుకంటే నేను చిన్నగా నడుస్తాను. అంతమంది జనంలో ఎలా వెళ్లాలో తెలియదు''''వాడు