
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన ఉద్యోగుల లీవ్ పాలసీ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు 31తో ముగిసే కంపెనీ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన సెలవులు ఆటోమేటిక్గా రద్దవుతాయి. అయితే, ఈ ఏడాదికి మాత్రమే ప్రత్యేక మినహాయింపునిస్తూ, వినియోగించుకోని సెలవులను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి బదిలీ (క్యారీ ఫార్వర్డ్) చేసుకునే వెసులుబాటును కల్పించింది.ఈ నిర్ణయం వెనుక పటిష్ఠమైన వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ సీఈఓ జూలీ స్వీట్ ఇటీవల ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో, నాలుగో త్రైమాసికంలో విక్రయాలను పెంచి, ఆదాయ వృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. 'మెగా డీల్స్'తో సహా అన్ని విభాగాల్లో విక్రయాలను వేగవంతం చేయాలని, ఇన్వెస్టర్లు కంపెనీపై నమ్మకంతో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా పనిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేలా ప్రోత్సహించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం యాక్సెంచర్ కొంత మేర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మే 31తో ముగిసిన త్రైమాసికంలో కొత్త బుకింగ్స్ 2 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. నాలుగో త్రైమాసికానికి సంబంధించి కంపెనీ వెల్లడించిన ఆదాయ అంచనాలు కూడా మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు దిగువనే నమోదయ్యాయి. దీనికి తోడు, ఈ ఏడాదిలో కంపెనీ షేర్ల విలువ సుమారు 36 శాతం వరకు క్షీణించింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ పనితీరును మెరుగుపరిచేందుకు యాజమాన్యం ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.మరోవైపు, జెనరేటివ్ ఏఐ ఆవిర్భావంతో కన్సల్టింగ్ రంగం