
ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన బెంగాల్ వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్ సంచలన రీతిలో అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడటం, శారీరక వేధింపులకు గురిచేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరించడం వంటి తీవ్ర ఆరోపణలతో హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన కఠిన ఆదేశాల మేరకే పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మంగళవారం ఛిన్సురాలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పోరెల్‌ను హాజరుపరచగా, న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన యువతి కర్ణాటకకు చెందిన మూడో సంవత్సరం మెడికల్ స్టూడెంట్. మోగ్రా పోలీసు స్టేషన్లో జూన్ 23న ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పోరెల్, ఆమె 2023 జనవరిలో మొదట కలుసుకున్నారు. ఆ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరి మధ్య నిరంతరం సంభాషణలు సాగాయి. దాదాపు మూడేళ్లన్నర పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పరస్పరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య కూడా పెళ్లికి సంబంధించిన చర్చలు జరిగాయి. వీరు కలిసి విదేశాలకు కూడా వెళ్లారని సమాచారం. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి గుర్తింపును రహస్యంగా ఉంచారు. పెళ్లి చేసుకుంటానని పోరెల్ తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. 2026 ఏప్రిల్ 2న పోరెల్‌ను కలవడానికి ఆమె ఢిల్లీకి వెళ్లింది. అక్కడ తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాడని, గదిలో ఒంటరిగా బంధించి ఆహారం కూడా ఇవ్వకుండా వేధించాడని పేర్కొంది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తమ ఇంటిమేట్ క్షణాల ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతానని బెదిరించాడని తెలిపింది. ఇతర మహిళలతో కూడా పోరెల్‌కు సంబంధాలు ఉన్నాయని తెలిశాకే తానెంతగా మోసపోయానో అర్ధమైందని ఆమె వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మోగ్రా పోలీసులు అభిషేక్ పోరెల్‌పై భారతీయ