Fitment Factor: 8వ వేతన సంఘం దిల్లీ సమావేశాలు ఆగస్టు 10న ముగియనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, వివిధ సంస్థల నుంచి ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు, వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఇతర ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన అభిప్రాయాల్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ (IRTSA) పలు కీలక డిమాండ్లను వేతన సంఘం ముందు ఉంచింది. ముఖ్యంగా రైల్వే సాంకేతిక ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 52,600 కు పెంచాలని ఐఆర్టీఎస్ఏ కోరింది. అలాగే ఇంకా ఉద్యోగుల లెవెల్‌ను బట్టి వేర్వేరుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు అమలు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. వీటిని పరిశీలించి వేతన కమిషన్ తుది నిర్ణయం తీసుకోనుంది.ఐఆర్టీఎస్ఏ ప్రతిపాదన ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 52600 గా ఉండాలి. ఇందు కోసం 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను ప్రాతిపదికగా తీసుకోవాలని సంఘం కోరింది. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాల్ని నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న కుటుంబ ఖర్చులు, ఆరోగ్య బీమా, ఇంటర్నెట్, తాగునీరు వంటి ఆధునిక అవసరాల్ని పరిగణనలోకి తీసుకొని కనీస వేతనాన్ని నిర్ణయించాలని పేర్కొంది.ఈ రైల్వే టెక్నికల్ ఉద్యోగుల ప్రతిపాదనల ప్రకారం లెవెల్ 1 నుంచి లెవెల్ 5 ఉద్యోగుల వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.92 గా సూచించింది. లెవెల్ 6-8 వరకు 3.50 ఫిట్మెంట్ ఫ్యాక్టర్, లెవెల్ 9 నుంచి 12 వరకు 3.80 ఫిట్మెంట్ ఫ్యాక్టర్, లెవెల్ 13 నుంచి 16 వరకు 4.09, లెవెల్ 17-18 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 4.38 గా సూచిస్తోంది.Read Also: తొలి జీతంతోనే సంపద సృష్టించే మార్గాలివే.. 'జెన్ జీ'కి నిపుణుల సలహాలు.. ఇలా పక్కా ప్లానింగ్ ఉంటే..!ఇక ఉద్యోగులకు ప్రతి ఏడాది 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఐఆర్టీఎస్ఏ ప్రతిపాదిస్తోంది