© 2026 nimisham.in

HRA పెరిగితే నెలకు రూ.15,800 వరకు అదనపు ఆదాయం

భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

లెవల్ 5 ఉద్యోగికి నెలకు దాదాపు రూ.15,768 వరకు అదనం

8th Pay Commission HRA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ కలగనుంది. 8వ వేతన సంఘం అమలుకు ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఆమోదం పొందితే ప్రాథమిక వేతనం, ఇంటి అద్దె భత్యం (HRA) కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్స్-కేటగిరీ నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ పెంపు భారీగా ఉండొచ్చని అంచనా. ప్రతిపాదిత లెక్కల ప్రకారం.. లెవల్ 5 ఉద్యోగికి నెలకు దాదాపు రూ.15,768 వరకు అదనంగా హెచ్ఆర్ఏ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇంకా ఖరారు కాలేదు.

ప్రస్తుతం HRA ఎంతంటే? :
7వ వేతన సంఘం సమయంలో హెచ్ఆర్ఏ అనేది నగరాల వర్గీకరణ ఆధారంగా నిర్ణయించారు. ఎక్స్-కేటగిరీ నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రాథమిక వేతనంలో 24 శాతం, వై-కేటగిరీ నగరాల్లో 16 శాతం, జెడ్-కేటగిరీ నగరాల్లో 8 శాతం హెచ్ఆర్ఏగా నిర్ణయించారు.

అయితే, కరువు భత్యం (DA) 2024 జనవరిలో 50 శాతాన్ని దాటగా హెచ్ఆర్ఏ రేట్లను కూడా పెంచారు. తద్వారా ఎక్స్-కేటగిరీ నగరాల్లో హెచ్ఆర్ఏ 30 శాతం, వై-కేటగిరీ ప్రాంతాల్లో 20 శాతం, జెడ్-కేటగిరీ నగరాల్లో 10 శాతానికి చేరింది.

ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏంటి? :
ఇంటి అద్దెలు, గృహ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం కింద హెచ్ఆర్ఏను ఇంకా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ సంయుక్త సంప్రదింపుల యంత్రాంగం మండలి (NC-JCM) నుంచి వచ్చిన ప్రతిపాదన ప్రకారం.. ఎక్స్-కేటగిరీ నగరాలకు హెచ్ఆర్ఏ 40 శాతానికి, వై-కేటగిరీ నగరాలకు 35 శాతం, జెడ్-కేటగిరీ నగరాలకు 30 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు.. డీఏలో మార్పులు వస్తే హెచ్ఆర్ఏ కూడా సవరించే విధానం ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నగరాల వర్గీకరణను దశాబ్ద కాల వ్యవధికి బదులుగా ప్రతి ఐదేళ్లకోసారి రివ్యూ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. కొన్ని ఇతర ఉద్యోగ సంఘాలు 2-అంచెలు, 4-అంచెలు వంటి ప్రత్యామ్నాయ హెచ్ఆర్ఏ విధానాలను ప్రతిపాదిస్తున్నాయి.

లెవల్ 5 ఉద్యోగికి ఎంత పెరగొచ్చు? :

8వ వేతన సంఘం ఫైనల్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ఇంకా ప్రకటించలేదు, అయితే 2.1 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంచనాగా తీసుకుంటే.. ఎక్స్-కేటగిరీ నగరాలకు 40 శాతం హెచ్ఆర్ఏ అమలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.. ప్రస్తుతం లెవల్ 5 ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.29,200 అనుకుంటే..