
8వ వేతన సంఘం ఇంకా తన నివేదికను సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు వెల్లడించింది. నివేదిక రూపకల్పన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, దీనిపై ఇప్పుడే ఎటువంటి స్పష్టత ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొంది.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిషన్ తన సిఫార్సులను సమర్పించేందుకు 18 నెలల గడువు ఉంది. ఈ లెక్కన 2027 మే నాటికి తుది నివేదిక వెలువడే అవకాశం ఉంది. ఆలోపు అవసరమైన పక్షంలో ఏదైనా అంశంపై మధ్యంతర నివేదిక ఇచ్చే వెసులుబాటు కూడా కమిషన్‌కు ఉంది.ప్రస్తుతం వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో చర్చలు పూర్తి కాగా, త్వరలో జైపూర్, చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్‌లలో సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను కమిషన్ ముందు ఉంచుతున్నాయి. ఉదాహరణకు, ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ (IRTSA) కనీస వేతనాన్ని రూ. 52,600గా నిర్ణయించాలని, 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని కోరింది.దేశవ్యాప్తంగా సుమారు 35.77 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 33.76 లక్షల మంది పెన్షనర్లు ఈ నివేదిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఫిట్మెంట్, కనీస వేతనం, ఇతర అలవెన్సులపై కమిషన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే తుది సిఫార్సులు వెలువడనున్నాయి. ఈ క్రమంలో 8వ వేతన సంఘం