
Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎర్రకోటపై 13వ సారి వరుసగా ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఇదిలాఉంటే.. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు
.





