
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అవినీతిపై గతేడాది ఫిర్యాదులు (corruption complaints) భారీగా నమోదయ్యాయి. 2025లో వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 70,584 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) వార్షిక నివేదిక వెల్లడించింది. వీటిల్లో 64,905 సమస్యలను అధికారులు పరిష్కరించారు. ఫిర్యాదుల్లో.. బ్యాంకులు, రైల్వేలకు సంబంధించిన సమస్యలే అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. బ్యాంకులకు సంబంధించి 9,933 ఫిర్యాదులు అందగా.. 9,520 పరిష్కరించారు. 413 పెండింగ్లో ఉన్నాయి. రైల్వేలకు సంబంధించి 9,381 ఫిర్యాదులు రాగా.. 8,754 పరిష్కరించారు. 627 పెండింగ్లో ఉన్నాయి. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖపై 6,531, స్థానిక సంస్థలపై 4,834, బొగ్గు రంగానికి సంబంధించి 4,118, ఆర్థిక శాఖపై 3,107, దిల్లీ ప్రభుత్వంపై 2,804 ఫిర్యాదులు అందాయి. పెట్రోలియం శాఖపై 2,722, దిల్లీ పోలీసులపై 2,633, రహదారులు-రవాణా శాఖపై 2,139, కేంద్ర హోంశాఖపై 2,036 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందిన ఫిర్యాదులపై చీఫ్ విజిలెన్స్ అధికారులు మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సీవీసీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోందని నివేదిక తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది