© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Vivo V80 Lite 5g Launching Soon: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అద్భుతమైన ముద్ర వేసుకున్న ప్రముఖ దిగ్గజం వివో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌తో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇందులో అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీవో కంపెనీ మోస్ట్ అవేటెడ్ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది గత మోడల్స్ కంటే చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన వివరాల ప్రకారం.. మొదట కంపెనీ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గూగుల్ ప్లే కన్సోల్ (Google Play Console) లిస్టింగ్‌లో ఈ మోడల్ అందుబాటులోకి రావడం విశేషం. ఇందులో భాగంగా అనేక రకాల ఫీచర్స్ కూడా లీక్ అయ్యి అందుబాటులోకి వచ్చాయి.. అద్భుతమైన డిజైన్.. ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Vivo V80 Lite 5G ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్‌తో పాటు చాలా అద్భుతమైన కర్వ్డ్ డిస్ప్లే డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో సెల్ఫీ కెమెరా కోసం ప్రత్యేకంగా హోల్-పంచ్ కటౌట్‌ను కూడా తీసుకు రాబోతోంది.. ముఖ్యంగా ఇందులో నీలం (Blue)తో పాటు తెలుపు (White) వంటి ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో యూజర్లను ఆకట్టుకునేలా ఇది రూపొందించిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K అమోలెడ్
(AMOLED) డిస్ల్పేను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు వినియోగదారుడికి మైండ్‌బ్లోయింగ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను పక్కాగా అందిస్తాయని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి..
కెమెరా క్వాలిటీకి పెట్టింది పేరైన Vivo.. ఈ ఫోన్లోనూ అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు ఫ్రంట్ భాగంలో భాగంలో వీడియో కాలింగ్స్, సూపర్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతూ ఉన్నాయి..
ఈ ఫోన్‌కు సంబంధించిన అతిపెద్ద హైలైట్ బ్యాటరీ భావించవచ్చు. ఇందులో ఏకంగా 7,050mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.. దీనితో పాటు అత్యంత ఫాస్ట్‌గా ఛార్జ్ అయ్యేందుకు 44W ఫ్లాష్‌ఛార్జ్ (FlashCharge) సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. దీనివల్ల ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే రోజులకు తరబడి బ్యాటరీ లైఫ్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందులో అద్బుతమైన MediaTek Dimensity 7360 Turbo ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.