
మన రోజు ఎలా ప్రారంభమవుతుందో, ఆ రోజు మొత్తం మన మానసిక స్థితి కూడా చాలావరకు అలాగే ఉంటుంది. ఉదయం లేవగానే ఒత్తిడి, ఆందోళన, హడావుడితో రోజును మొదలుపెడితే రోజంతా అలసట, చిరాకు వెంటాడుతుంటాయి. కానీ కొన్ని చిన్న చిన్న అలవాట్లను ఉదయం పాటిస్తే మన శరీరంతో పాటు మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాదు, పని మీద ఏకాగ్రత పెరగడం, ఒత్తిడి తగ్గడం, రోజంతా పాజిటివ్‌గా ఉండడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం తప్పకుండా చేయాల్సిన ఐదు పనులేంటో తెలుసుకుందాం. రాత్రంతా నిద్రపోయిన తర్వాత మన శరీరం కొంత మేర డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. ఇది శరీరంలో జీవక్రియలను చురుకుగా చేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో చక్కగా పనిచేస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం కొద్దిసేపు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే రక్తప్రసరణ మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఎక్కువ సమయం లేకపోతే కనీసం 15 నుంచి 20 నిమిషాలు నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకుంటే శారీరకంగా, మానసికంగా ఎంతో తేడా కనిపిస్తుంది. చాలామంది నిద్రలేచిన వెంటనే మొబైల్ తీసుకుని సోషల్ మీడియా, వాట్సాప్ లేదా వార్తలు చూడటం మొదలుపెడతారు. దీంతో తెలియకుండానే మెదడు ఒత్తిడికి గురవుతుంది. ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం, ప్రతికూల వార్తలు చూడటం వల్ల ఉదయం నుంచే మనసు భారంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం మొదటి 30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండండి. ఆ సమయాన్ని