పిల్లల పెంపకంలో సాధారణంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు చదువుతో పాటు ఇంటి పనులు నేర్పించాలని చూస్తారు. కానీ మారుతున్న నేటి సమాజంలో ఈ నైపుణ్యాలు మగపిల్లలకు కూడా అంతే అవసరం. నేడు కుటుంబ బాధ్యతలు కేవలం ఒకరిపైనే ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ సమానంగా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. "పెళ్లయ్యాక కోడలు వచ్చి అన్నీ చూసుకుంటుంది" అనే పాతకాలపు ఆలోచనలకు ప్రస్తుత రోజుల్లో తావు లేదు. వర్కింగ్ వుమెన్ మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ సమాన బాధ్యతల్ని కోరుకుంటున్నారు. అందుకే కొడుకులను స్వావలంబన గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి చిన్నతనం నుంచే కొన్ని ప్రాథమిక పనులు నేర్పించాలి. నిపుణుల ప్రకారం కొడుకులకు తప్పక నేర్పించాల్సిన 5 ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చుద్దాం.1. వంట చేయడం (బేసిక్ కుకింగ్) వంట అనేది ఒక లింగానికి చెందిన పని కాదు, అది బతకడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యం (Life Skill). కేవలం మ్యాగీ చేయడం వస్తే సరిపోదు. అన్నం, పప్పు, కూరగాయలు, రొట్టె లేదా కనీసం కిచిడీ వంటివి రుచిగా, శుభ్రంగా చేయడం నేర్పించాలి. ఇది వారికి విద్యార్థి దశలోనూ, భవిష్యత్తులో ఒంటరిగా ఉన్నప్పుడూ ఎంతగానో ఉపయోగపడుతుంది.2. బట్టలు ఉతకడం, ఆరేయడం, ఐరన్ చేయడం తమ సొంత బట్టలను వాషింగ్ మెషీన్లో వేయడం (లేదా చేత్తో ఉతకడం), ఆరేయడం, మడతపెట్టి కబోర్డులో అమర్చుకోవడం నేర్పించాలి. అలాగే అత్యవసరమైనప్పుడు సొంతంగా బట్టలు ఐరన్ చేసుకోవడం నేర్పిస్తే, ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.3. గదిని శుభ్రంగా, సర్ది ఉంచుకోవడం చాలామంది మగపిల్లలకు వస్తువులను తీసిన చోట తిరిగి పెట్టే అలవాటు ఉండదు. ఈ విషయంలో చాలా వస్తువులను చిందరవందరగా పడేయకుండా ఒక పద్ధతిలో ఉంచుకోవడం, దుమ్ము దులపడం, బెడ్షీట్ సర్దుకోవడం, అవసరమైనప్పుడు చీపురు పట్టి ఊడ్వడం వంటివి అలవాటు చేయాలి. ఇది వారిలో పరిశుభ్రతను, బాధ్యతను పెంచుతుంది.4. ఇంటి నిర్వహణ, సరుకుల లెక్కలు మార్కెట్కు వెళ్లి నాణ్యమైన