పైన టమాటాలు.. లోపల ఆవులు.. ఎంతకు తెగించార్రా? గుంటూరు జిల్లా పెద్దికాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజా టోల్ గేట్ వద్ద పశువుల అక్రమ రవాణా ఉదంతం కలకలం రేపింది. పశువులను తరలించేందుకు కేటుగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. తాజాగా ఒక లారీలో టమాటా లోడ్ మాటున పశువులను అక్రమంగా తరలిస్తున్న వైనం వెలుగు చూసింది. చిన్నపాటి స్థలంలో ఏకంగా 40 మూగజీవాలను కుక్కి పరిమితికి మించి తరలించేందుకు యత్నించారు. అక్రమంగా పశువుల వ్యాపారం చేసేందుకు వీటిని తరలిస్తున్నారనే అనుమానంతో ఖాజా టోల్ వద్ద అటుగా వస్తున్న ఆ లారీని గో రక్షకులు అడ్డుకున్నారు. అనుమానంతో లారీని తనిఖీ చేయగా.. పైన టమాటాలు, వాటి కింద అట్టడుగున పశువులు ఉన్నట్లు బయటపడింది. మూగజీవాల దయనీయ స్థితిని చూసి గో రక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ రవాణాకు వెంటనే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఈ వార్తకు సంబంధించిన