© 2026 nimisham.in
మొబైల్ ఛార్జింగ్ గొడవ తెచ్చిన ముప్పు.. కదులుతున్న రైలు నుంచి దూకిన ప్రయాణికులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురేనా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఖజురహో - ఉదయ్‌పూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయనే పుకారుతో.. ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రైలులో ఒక్కసారిగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడటంతో... భయపడిపోయిన కొందరు ప్రయాణికులు ఎమెర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపారు. ప్రాణాలు కాపాడుకోవాలనే కంగారులో కదులుతున్న రైలు నుంచి.. అలాగే రైలు ఆగగానే చాలామంది ప్రయాణికులు కిందకు దూకేశారు. ట్రాక్‌లపైకి దూకిన ప్రయాణికులు పక్కనే ఉన్న మరో రైల్వే ట్రాక్‌పైకి వెళ్లారు. అదే సమయంలో పక్క ట్రాక్ మీదుగా వస్తున్న.. పాతాళ్ కోట్ ఎక్స్‌ప్రెస్ రైలును వారు గమనించలేకపోయారు. ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మలుపు తిరిగి ఉండటంతో... అటు లోకో పైలట్... ఇటు ప్రయాణికులు ఒకరినొకరు సకాలంలో చూసుకోలేకపోయారు. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ... వేగంగా వస్తున్న పాతాళ్ కోట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారితో సహా నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే రైలు చక్రాల కింద పడి మరణించారు. మృతులను ఆగ్రా, బికనీర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. అసలు.. రైలులో ఎలాంటి మంటలు రాలేదని... మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ వద్ద జరిగిన చిన్నపాటి గొడవ వల్ల... ఎవరో మంటలు అంటూ తప్పుడు పుకార్లు లేపడం వల్లే... ఈ ఘోర ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ వార్తకు సంబంధించిన