
‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. వీరి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ వినాయక చవితి సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పైనుంచి కరెన్సీ నోట్లు రాలుతుండగా హీరో పడే పాట్లను హిలేరియస్‌గా చూపించిన ఈ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని సంక్రాంతి 2027 పండుగ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అధికారికంగా ప్రకటించారు.




