© 2026 nimisham.in
నదిలో కొట్టుకుపోయిన 3 వేల గ్యాస్ సిలిండర్లు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు సృష్టిస్తున్న బీభత్సానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయగఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ (HPCL) పాతాళ్గంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే.. ప్లాంట్లో ఉన్న దాదాపు 3,000 గ్యాస్ సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. నదిలో వేల సంఖ్యలో సిలిండర్లు తేలియాడుతున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై రాయగఢ్ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ ఇళ్లకు తీసుకెళ్లవద్దని, వాటిలో గ్యాస్ లీకేజీ ఉంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సిలిండర్లు ఎక్కడ కనిపించినా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ వార్తకు సంబంధించిన