
ఇంటర్నెట్ డెస్క్: మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో (Central African Republic) ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని కూలిన (gold mining site collapsed) ఘటనలో 30 మంది మృతి చెందారు. పలువురు గనిలో చిక్కుకుపోయారు. పశ్చిమ ప్రాంతంలోని నానా-మాంబెరె అబ్బా పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ గని ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. వెంటనే స్థానికులు, తోటి కార్మికులు.. గంటల తరబడి శ్రమించి 30 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గనిలో చిక్కుకున్న వారిని సజీవంగా బయటకు తీసే అవకాశాలు తగ్గుతున్నాయని ప్రమాదం నుంచి బయటపడిన ఓ కార్మికుడు తెలిపాడు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో ఇలాంటి చిన్న తరహా బంగారు గనుల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. సరైన రక్షణ, భద్రతా చర్యలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు