
మెట్‌పల్లి పట్టణం: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే వినాయక చవితి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తుంటారు. మరోవైపు నిత్య పూజల కోసం ప్రత్యేకంగా 25 కిలోల వెండితో వినాయకుడిని తయారు చేయించారు. గణపతితో పాటు మహాలక్ష్మి, సరస్వతి దేవి, శివలింగాలు కూడా వెండితో తయారు చేయించారు. నవరాత్రుల్లో భాగంగా వెండి వినాయకుడిని మేళతాళాల మధ్య మంగళవారం పురవీధుల గుండా ఊరేగించారు. స్థానిక వాసవి గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి వేదమంత్రాలతో గణేశుడికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం 108 బంగారు పుష్పాలతో స్వామివారిని పూజించారు. ఏటా తొమ్మిది రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పూజలు అభిషేకాలు, భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ మైలారపు లింబాద్రి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాంబాబు, కమిటీ సభ్యులు, కోట కిరణ్, చందు, చాడ సురేష్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.