ఆ యువకుడి వయస్సు 24.. తల్లిదండ్రులు మరణించారు.. ఒంటిరిగా ఉండేవాడు.. ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి మద్యానికి బానిసయ్యాడు. మరి ఏమైందో ఏమోగానీ సడెన్గా చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే, చనిపోయే క్షణంలో ఆ యువకుడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరణం గురించి పెట్టడమే కాకుండా.. తాను చనిపోతే స్నేహితులే అంత్యక్రియలు నిర్వహిస్తారని అర్థం వచ్చేలా పెట్టాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధికల కుమారుడు జనార్దన్ రెడ్డి (24). కొన్నేళ కిందట తల్లిదండ్రులు మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. తనను ఎవ్వరూ పట్టించుకునేవారు లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.READ ALSO చావులోనూ తోడుగా.. గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన భార్యాభర్తలుజనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్టాలో తాను చనిపోతున్నట్లు అర్థం వచ్చేలా స్టేటస్ పెట్టాడు. చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందంట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా అంటూ అతను పెట్టిన పోస్టు అందర్నీ కలచివేసింది. ఇదంతా ఒక అమ్మాయి కోసం పెట్టినట్టు అర్థమొచ్చేలా ఉంది. తాను చనిపోతే తన స్నేహితులు అంత్యక్రియలు చేస్తారంటూ స్నేహం గురించే తెలిపే ఇంకొన్ని స్టేటస్లు పెట్టాడు.అయితే, జనార్దన్ రెడ్డి మరణానికి ముందు నుంచే తాను ఆత్మహత్యకు పాల్పడతాను అని చెప్పినా.. ఎవ్వరూ పట్టించుకోలేదు. తనకు బతకాలని లేదు అని అర్థమొచ్చేలా స్టేటస్లు పెట్టినప్పుడయినా ఎవరైనా దగ్గరికి తీసుకుని మాట్లాడి ఉండుంటే మరణించేవాడు కాదు. కేవలం 24 సంవత్సరాల వయస్సులోనే అతను మరణించడం గ్రామస్థులను కలచివేసింది. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడం.. ఆ తర్వాత ఒంటరిగా జీవించడం. మనస్సులో లేనిపోని ఆలోచనలు