
ఏడాదికి రూ.45 లక్షల జీతం. ప్రమోషన్ వస్తే జీతం రూ.65 లక్షలకు పైగానే. అంటే ఏకంగా రూ.20 లక్షల అదనపు ఆదాయం. ఇంత భారీ హైక్‌ను సాధారణంగా ఎవరూ వదులుకోరు. కానీ బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. డబ్బు కంటే తన వ్యక్తిగత జీవితం ముఖ్యమని భావించాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ ‘యూఎబిలిటీ’ వ్యవస్థాపకుడు రోహన్ ధావన్ తన స్నేహితుడి అనుభవాన్ని లింక్డిన్లో పంచుకున్నారు. ప్రస్తుతం అతడు ఏడాదికి రూ.45 లక్షలు సంపాదిస్తున్నాడు. ప్రమోషన్ తర్వాత రూ.65 లక్షలకు పైగా జీతం వస్తుందని కంపెనీ ఆఫర్ చేసింది. ఉన్నత హోదాతో పాటు పెద్ద టీమ్ బాధ్యతలు కూడా అప్పగించనుంది.అయితే ఈ ప్రమోషన్‌తో అదనపు బాధ్యతలు భారీగా పెరుగుతాయని అతడు భావించాడు. వారంలో నాలుగు రాత్రులు అమెరికా టీమ్‌తో కాన్ఫరెన్స్ కాల్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేయాలి. ప్రస్తుతం ఉన్న టీమ్ కంటే దాదాపు రెండింతల మంది బాధ్యత తీసుకోవాలి. వీకెండ్లు కూడా పూర్తిగా వ్యక్తిగత సమయంగా ఉండకపోవచ్చని తెలిసింది.వచ్చే ఏడాది పిల్లల కోసం దంపతులు ప్రణాళికలు వేసుకుంటున్నారని రోహన్ తెలిపారు. ఆ టెక్కీ వారంలో ఐదు రోజులు ఉదయాన్నే వ్యాయామం చేస్తాడు. ప్రతి బుధవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తాడు. ప్రమోషన్ తీసుకుంటే ఈ వ్యక్తిగత సమయం తగ్గిపోతుందని భావించి భారీ హైక్‌ను వదులుకున్నాడు.అయితే అతడి నిర్ణయం తండ్రిని ఆశ్చర్యానికి గురి చేసింది. రూ.20 లక్షల అదనపు