© 2026 nimisham.in

KTR : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ.. అక్షరాలు రాని ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాజీనామా చేయాలా? డోకేబాజ్ రేవంత్ చేయలా? కేసీఆర్తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ ఐతుంది అంటూ పోకిరి సినిమా డైలాగ్ తో రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read : Driving Licence : వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం కీలక మార్పులు.. హద్దుమీరితే రద్దే!

కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన జెన్ జీ సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. మంత్రులు, ముఖ్యమంత్రి కుక్కల్లాగా కొట్లాడుకుంటున్నారని అన్నారు. మీకు దండం పెట్టినోళ్లే రేపు పిండాలు పెడతారు. రాహుల్ గాంధీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని వదిలేశాడు. స్టీల్ కవర్లో పంపిన మీ సీఎం ఏం చేస్తుండో నీకు సోయి ఉందా రాహుల్ గాంధీ అంటూ ప్రశ్నించారు. నెలకోసారి మూటలు తీసుకొని రాహుల్ గాంధీ నోరుమూసుకొని కూర్చుంటున్నాడని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

జెన్ జీ నడుం బిగిస్తే కేంద్రంలో మోదీ అంతటోడే కదిలిండు.. ఈ చిట్టి నాయుడు ఓ లెక్క అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అనే ముసలి నక్క తెలంగాణ విషయంలో చేసి దురాగతాలు అన్నీఇన్నీ కావు. తెలంగాణ ఇస్తామని మోసం చేసి ఎందరో యువకుల ఆత్మబలిదానాలకు కారణమైంది కాంగ్రెస్. 60ఏళ్లు తెలంగాణ ప్రజల రక్తం తాగిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో తెలంగాణ యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నాయకులు పెద్దపెద్ద మాటలు చెప్పారు.. ఇప్పుడేమైంది? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.