
మహిళా ఎస్సైపై దురుసుప్రవర్తన..ఆముదాలవలస వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. YSRCP Chintada Ravikumar Arrest: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన నేపథ్యం.. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఇటీవల శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్‌కు స్వాగతం పలికేందుకు చింతాడ రవికుమార్ తన అనుచరులతో కలిసి తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో మహిళా ఎస్సైపై కొందరు వైసీపీ నేతలు దురుసగా ప్రవర్తించారు. కొట్టారోడ్డు వద్ద బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల రవికుమార్, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, చింతాడ రవికుమార్‌ను ఈ కేసులో ఏ1 గా చేర్చారు. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. రవికుమార్ ఆరోపణలు, వివరణ.. అరెస్ట్ సమయంలో చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆరోపణలు గుప్పించారు. తన కుటుంబ సభ్యులను, వైసీపీ కార్యకర్తలను విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీ వద్దకు లొంగిపోయేందుకు వెళ్తుండగా తనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు