సన్నగా ఉన్నవారిని లావుగా మార్చే హై కేలరీ ఫుడ్స్
నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి హెల్తీగా బరువు పెరిగేందుకు సహాయపడతాయి. అందుకే బరువు పెరగాలని చూసేవారు వేడి అన్నం, పప్పుతో నెయ్యి కలిపి తింటే చాలా మంచిది. బర్రె పాలు లేదా ఆవు పాలు కొవ్వుతో పాటు తీసుకుంటే కావాల్సిన ప్రోటీన్, ఫ్యాట్స్, కేలరీలు అందుతాయి. తద్వారా బరువు పెరగవచ్చు. అయితే జీర్ణ సమస్యలు ఉంటే పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. ఖర్జూరాల్లో నేచురల్ షుగర్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పాలలో ఖర్జూరాలు కలిపి తీసుకోవడం లేదా నేరుగా తీసుకోవడం ద్వారా బరువు పెరగవచ్చు. ఎండుద్రాక్ష (కిస్మిస్)లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కిస్మిస్ తినడం ద్వారా సన్నగా ఉన్నవారు బరువు పెరగవచ్చు. బాదం, జీడిపప్పు లాంటి గింజల్లో హెల్తీ ఫ్యాట్స్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే బరువు పెరగవచ్చు. వేయించిన శనగ పిండిని నీళ్లు లేదా పాలతో కలిపి కొద్దిగా బెల్లం కలిపి సత్తు చేసుకోవచ్చు. ఇది ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేసి బరువు పెంచడంలో సహాయపడుతుంది. అన్నం, పెసరపప్పుతో తయారుచేసే కిచిడిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. వేడి వేడి కిచిడిలో నెయ్యి వేసుకుంటే తింటే బరువు పెరిగేందుకు సహాయపడుతుంది. చిలగడదుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడమే కాకుండా బరువు పెరిగేందుకు సహాయపడతాయి. పనీర్‌లో ప్రోటీన్, ఫ్యాట్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కండలు పెరిగేందుకు సహాయపడటమే కాకుండా బరువు పెరిగేలా చేస్తాయి


