
Vishwanath And Sons Closing collections: విశ్వనాథ్ అండ్ సన్స్క్లోజింగ్ కలెక్షన్లు..సూర్య మూవీకి లాభమా? న
Vishwanath And Sons Closing collections: విశ్వనాథ్ అండ్ సన్స్ క్లోజింగ్ కలెక్షన్లు..సూర్య మూవీకి లాభమా? న

Vishwanath And Sons Closing collections: విశ్వనాథ్ అండ్ సన్స్ క్లోజింగ్ కలెక్షన్లు..సూర్య మూవీకి లాభమా? న

Vishwanath and Sons OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Vishwanath and Sons OTT: ఓటీటీలోకి రూ.260 కోట్ల సినిమా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vishwanath And Sons Collections: సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ కలెక్షన్స్.. 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ఆగస్ట్ (August 2026) మొదటివారంలో కొరియన్ కనకరాజు, డీసీ, జీడీ నాయుడు, కేజేక్యూ, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “కొరియన్ కనకరాజు” క్లీన్ హిట్ అనిపించుకుంది. పరిమిత బడ్జెట్ లో తీయడం, మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వరుణ్ తేజ్ ఈ మూవీతో గట్టెక్కాడు. మిగతా సినిమాల్లో “డీసీ”కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తక్కువ రేటుకు అమ్మకాలు సాగడంతో బయ్యర్లకు బాగానే డబ్బులొచ్చాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రెండో వారంలో “విశ్వనాధ్ అండ్ సన్స్,” పళ్ల బురుసు, పాంచాలి పంచ భర్తృక, అగథ, మకుటం, హుషార్ పిట్టలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “విశ్వనాధ్ అండ్ సన్స్” సినిమా సూపర్ హిట్టయింది. తమిళ్ లో కంటే తెలుగులో మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పళ్ల బురుసుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎమ్మెస్ రాజు తీసిన అగధ చిత్రం కూడా ఆడకపోగా.. విశాల్ చేసిన మకుటం కూడా ఫ్లాప్ అయింది. సురేశ్ బాబు రిలీజ్ చేసిన హుషార్ పిట్టలు సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడో వారంలో ఇరుముడి, ఖలీఫా, సర్దార్ సర్వాయి పాపన్న, అమీర్ లోగ్, రెడ్ బ్యాగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. రవితేజ నటించిన “ఇరుముడి” బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలో టాక్సిక్, కికు చిరంజీవి, హాయ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. యశ్ నటించిన “టాక్సిక్” సినిమా డిజాస్టర్ అయింది. మొదటి వారం 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ, సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఆగస్ట్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, 2 సినిమాలు హిట్

‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది. ‘ఇరుముడి’ తొలి రోజే సుమారు రూ.23–25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్ తో వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, పాజిటివ్ రెస్పాన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ దూకుడు ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘విశ్వనాథ్ & సన్స్’కు (Vishwanath and sons) కొంత పోటీగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ బిజినెస్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాభాల జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వీకెండ్లోకి అడుగుపెడుతున్న సమయంలో ‘ఇరుముడి’ రావడం సూర్య సినిమాకు సవాల్‌గా మారింది. ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకర్షిస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ‘విశ్వనాథ్ & సన్స్’కు కొన్ని కేంద్రాల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పలేం. ఇప్పటికే సినిమాకు వచ్చిన టాక్, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు దానికి బలంగా మారాయి. సినిమా లాభాల దిశగా

సూర్య లేటెస్ట్ గా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీతో విజయాన్ని అందుకున్నారు. గత వారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో వారు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ 8 రోజులు పూర్తి చేసుకుంది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చాయి. అయినా ఈ మూవీ కలెక్షన్లు తగ్గలేదు సరికదా, శుక్రవారం పెరగడం విశేషం. `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీకి ఎనిమిదో రోజు రూ.4.50కోట్లు వచ్చాయి. గురువారం రూ.4.20కోట్లు రాగా, ముప్పై లక్షలు పెరగడం విశేషం. వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటుందనేదానికిది నిదర్శనం. ఇక 8 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.149.77కోట్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 150కోట్ల క్లబ్లో చేరింది. ఇండియాలో దీనికి రూ.99.52కోట్ల గ్రాస్ రాగా, రూ.86.10కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఎనిమిదో రోజు ఓవర్సీస్లో కోటిన్నర రాబట్టింది. మొత్తంగా అక్కడ రూ.50.26కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకి తమిళంలో కంటే తెలుగులోనే కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. 8వ రోజు కూడా తమిళంలో రూ.1.85కోట్లు వస్తే, తెలుగులో రూ.2.40కోట్లు రావడం విశేషం. ఓవరాల్ కలెక్షన్లలో కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి రూ.130కోట్ల బడ్జెట్ అయ్యింది. సుమారు రూ.90కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందట. ఈ లెక్కన సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పటికే రూ.150కోట్లు దాటింది. ఈ వచ్చే వారంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, వైవా హర్ష

తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే..? తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తరువాత సూర్య సినిమా ఓ రికార్డ్ సాధించింది. అదే సమయంలో మరో సినిమా ఫ్యాన్స్ నీరుకారి పోయేలా చేసింది. ఎందుకో చూద్దాం? మొన్నటి దాకా విజయ్ సినిమా ఎలా ఉన్నా ఇట్టే రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేది. అలాంటిది విజయ్ (Vijay) తాజా చిత్రం జననాయగన్ (Jana Nayagan) ఆ ఫీట్ సాధించలేక పోయింది. అందునా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత వచ్చిన 'జననాయగన్' బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో 'జననాయగన్' కంటే ముందు విడుదలైన సూర్య (Suriya) కరుప్పు (Karuppu) విజయ్ సినిమా కంటే ఎక్కువ వసూలు చేయడం విశేషంగా మారింది. సూర్య 'కరుప్పు' సినిమా మే 15వ తేదీన విడుదలయింది. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తరువాత జూలై 23న 'జననాయగన్' జనం ముందు నిలచింది. తమిళనాడులో 'కరుప్పు' ఫినిషింగ్ బాక్సాఫీస్ నంబర్ 170 కోట్లు దాటింది. 'జననాయగన్' నెలలోపే ఇక ముందుకు సాగే పరిస్థితి లేదని తేలింది. ఈ సినిమా చివరకు తమిళనాట 160 కోట్ల వద్ద ఆగిపోయింది. చిత్రమేంటంటే ఈ మధ్యే విడుదలైన సూర్య సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్స (Vishwanath & Sons) మాత్రం తమిళనాడులో ముందు సినిమా 'కరుప్పు'లా హల్ చల్ చేయలేకపోతోంది. ఈ మూవీ ఆరు రోజులకు 38 కోట్లు మాత్రమే పోగేసింది. అంటే తమిళనాడులో 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు ఎదురుగాలి వీస్తోందన్న మాట. అదే ఇప్పుడు సూర్య అభిమానులకు ఆవేదన కలిగిస్తోన్న అంశం. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం తెలుగునాట విశేషాదరణ చూరగొంది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూలు

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్టైన్మెంట్స్తో తనకున్న ప్రత్యేక అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య కథానాయకుడిగా నాగవంశీ నిర్మించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సితార సంస్థతో తనకున్న సంబంధం డబ్బులు, అగ్రిమెంట్లకు అతీతమైనదని ఆయన స్పష్టం చేశారు. తన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితమే సిద్ధమైన కథఈ సినిమా వెనుక ఉన్న నిర్మాణ ప్రయాణాన్ని వెంకీ అట్లూరి వివరంగా పంచుకున్నారు. ఈ కథను 2022 లోనే రాసుకున్నానని, సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని తెలిపారు. సూర్య కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ కథ వినగానే ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. అనవసరమైన కామెడీ లేకుండా కథను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాలని సూర్య సూచించడంతో దానికి అనుగుణంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాత్రల ఎంపిక మరియు వసూళ్ల తీరుకథాంశం మరియు నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'ప్రేమలు' సినిమా చూసిన తర్వాత మమితా బైజును ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశామని, తమిళంపై ఆమెకున్న పట్టు సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. దీంతో తమిళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలో రూపొందించినట్లు చెప్పారు. అక్కడ థియేటర్లు, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ వసూళ్లు తక్కువగా కనిపిస్తాయి, అయితే లాంగ్ రన్ బలమైన ప్రభావం చూపిస్తుందని ఆయన విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయంసినిమా వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ₹155 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో నికరంగా ₹81.63 కోట్లు వసూలు

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని

సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్‌ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్‌కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్‌కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్‌తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్‌ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్‌లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్‌ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్‌ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్‌లో లేరు. సరిగ్గా అదే టైమ్‌లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో శ్రీను వైట్ల స్టైల్‌ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్‌తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్! యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు! వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు

మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ & సన్స్’లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది మమిత. నివిన్ పౌలి హీరోగా, మమిత కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’(Bethlehem Kudumba Unit). ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏ.డి. దర్శకత్వం వహించారు. ఈ నెల 21 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఏ నేపథ్యంలో విడుదల చేసిన చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వేగవంతంగా సాగుతున్నాయి. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో నటనలో తన మార్క్ చూపించిన మమితా బైజు ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మమితా బైజు మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా? ఆమెకున్న క్రేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇటీవల వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించిన మమితా బైజు.. ఈ సినిమాతో కూడా అదే జోరు కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు నివిన్ పౌలీ కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి

నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్‌గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు. టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్‌లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్‌గా స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌ను టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్‌లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్‌కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్‌తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ

సూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్లో డౌన్ అవుతుంది. వీకెండ్స్ తో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ వీక్ డేస్‌లోనూ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. స్ట్రాంగ్‌గానే ఉండటం విశేషం. చాలా వరకు సినిమాలు వీక్ డేస్‌లో భారీగా పడిపోతాయి. ఈ చిత్రం మాత్రం డీసెంట్ గా వసూళ్లని రాబట్టడం విశేషం. ఇది సినిమా విజయానికి కారణమవుతుందని చెప్పొచ్చు. సూర్య, మమితా బైజు జంటగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` కలెక్షన్లు చూస్తే, ఐదో రోజు ఇండియాలో రూ.7.33కోట్లు రాబట్టింది(సాక్నిల్క్ లెక్కల ప్రకారం). ఓవర్సీస్లో మరో రెండు కోట్లు వచ్చాయి. సోమవారంతో పోల్చితే కోటి వరకు తగ్గాయి. కానీ అది పెద్ద మార్పుగా చెప్పలేం. సాధారణంగా బుధ, గురువారం వరకు కలెక్షన్లు తక్కువగానే ఉంటాయి. మళ్లీ శుక్రవారం నుంచి పుంజుకుంటాయి. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.128.60కోట్లు రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.83.60కోట్ల గ్రాస్, రూ.72.30కోట్ల నెట్ వచ్చింది. ఓవర్సీస్లో సుమారు రూ.45కోట్లు రావడం విశేషం. ఇది ఓవర్సీస్లో దుమ్ములేపుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతుంది. తెలుగులో ఐదో రోజు రూ.3.50కోట్లు రాగా, తమిళంలో రూ.2.35కోట్లు మాత్రమే రావడం గమనార్హం. `విశ్వనాథ్ అండ్ సన్స్` సినిమాకి అయిన థియేట్రికల్ బిజినెస్ రూ.90కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.22కోట్లుగా నిర్ణయించారు. ఇక్కడ ఈ వీక్‌తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఓటీటీ రూపంలో రూ.85కోట్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రూపంలో మరో రూ.28కోట్లు వచ్చాయి. ఆడియో రూపంలో రూ.12కోట్లు వచ్చాయి. మొత్తంగా బిజినెస్ రూ.215కోట్లు అని సమాచారం. సినిమాకి అయిన బడ్జెట్ రూ.130కోట్లు. దీంతో మేకర్స్ ఇప్పటికే రూ.85కోట్ల లాభాల్లో ఉన్నారు. థియేట్రికల్ గా సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్

సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవిత సత్యాలను, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను గుండెలకు హత్తుకునేలా చూపుతాయి. రీసెంట్గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలోని ఒక సీన్ వెనుక ఉన్న రియల్ ఇన్సిడెంట్ గురించి డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. మనం స్క్రీన్ మీద చూసి భావోద్వేగానికి గురయ్యే సీన్స్ వెనుక దర్శకులు తమ నిజ జీవితంలో చూసిన, అనుభవించిన ఘటనలు ఉంటాయి. వెంకీ అట్లూరి రాసిన ఒక డ్రైవర్ ఇంటర్వ్యూ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఏడిపించేసింది. అయితే అసలు ఆ సీన్ రాయడానికి ఇన్స్పిరేషన్ దిల్ రాజు అని వెంకీ తెలిపారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. 2012-2013 ప్రాంతంలో తాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దగ్గర పనిచేస్తున్నప్పటి ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో SVC బ్యానర్ కాస్త క్లిష్టమైన పరిస్థితులలో ఉంది. అదే సమయంలో సెట్స్‌లో పనిచేసే ఒక లైట్‌మ్యాన్, తన కొడుకుకి యూఎస్‌లోని కాలేజీలో సీటు వచ్చిందని, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆర్థిక సాయం కావాలని కోరాడు. ఆ రోజుల్లో ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్ ధర దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉండేది. అప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజుకి అది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ, ఇచ్చినా మాట ప్రకారం ఆ పిల్లాడి ట్రావెల్ కు అయ్యే డబ్బులు తక్షణమే చెల్లించి సహాయం చేశారు. ఒక సాధారణ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం పడే తపన, ఆయనకు అండగా నిలిచిన మనుషుల మంచితనం.. ఈ ఘటనే వెంకీ అట్లూరి మనసులో బలంగా నాటుకుపోయింది. అదే ఆ ఎమోషనల్ సీన్ రాయడానికి ప్రధాన ఇన్స్పిరేషన్గా మారింది. అంతేకాదు, సినిమాలో ప్రతీ ఎమోషనల్ కన్వర్జేషన్ తర్వాత వాతావరణాన్ని తేలికపరచడానికి చిన్న జోక్

ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ డిస్కర్షన్ లో ఒకటిగా కూడా మారిందంటే విశ్వనాధ్ అండ్ సన్స్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్ర కథని దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ధనుష్, దుల్కర్ సల్మాన్ కి వినిపించాడు. ఆ తర్వాత టీం సలహాతో సూర్యకి వినిపించడం జరిగింది. ఆ విధంగా సూర్య వద్దకి చేరి ఇప్పుడు అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు స్టార్ తెలుగు హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్. దుల్కర్, ధనుష్ మాత్రం నిజం. ఇక బాక్సాఫీస్ వద్ద విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో జోరు చూపిస్తూ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. లాంగ్ రన్ లో పలు చిత్రాల రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం. దిల్ రాజు రియల్ లైఫ్ సీన్: 'విశ్వనాథ్ & సన్స్'కి ఇన్స్పిరేషన్ ఏంటో చెప్పిన వెంకీ అట్లూరి.! లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే?

నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. వారి కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 'కరుప్పు' తర్వాత సూర్యకు ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.50 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.7.50 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్లో రూ.2 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.3.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళనాడులో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. అయితే, షోల పరంగా చూస్తే తెలుగులో 1924 షోలు, తమిళంలో 3038 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే విశేష ఆదరణ పొందుతోంది

విశ్వనాధ్ అండ్ సన్స్ లో అభిమానులు సెల్యులాయిడ్ పై 'సూర్య' ని విశ్వనాధ్ గా చూసుకొని మురుసిపోతున్నారు. ఇది కదా సూర్య అంటే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ శ్రావణ మాస శోభకి మరింత కాంతులు వెదజల్లుతున్నారు. ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పట్టడానికి శ్రావణ మాస శోభనే ఒక కారణం కావచ్చు. నిజానికి సంజయ్ విశ్వనాధ్ గా సూర్య నటన అంత ఆషామాషి తో కూడుకున్న వ్యవహారం కాదు. క్యారక్టర్ కి తగ్గట్టుగా పిన్ టూ పిన్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాలంటే ఎంతో శ్రమ తప్పని సరి. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో కలెక్షన్స్ తుపాన్ సృష్టిస్తుంది. ఆదివారం ఒక్క రోజే 5.2 కోట్ల గ్రాస్ ని రాబట్టి తన అర్హత ఉన్న రేంజ్ ని చాటి చెప్పింది. దీంతో మొదటి మూడు రోజులకి కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు 14 కోట్ల మార్కుని తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా కూడా నిలవడం గమనార్హం. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు దక్కే వీలుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం, మాటలకి, మాగి గా మమితా బైజు నాచురల్ పెర్ ఫార్మెన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు, జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి ఫొటోగ్రఫీ పోటాపోటీగా విశ్వనాధ్ అండ్ సన్స్ కి కుదిరాయి. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకి సుమారు 120 కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టింది. ఎన్టీఆర్ 'డ్రాగన్' అప్డేట్: బిగ్ షాక్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్.! 'ది ప్యారడైజ్'

సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తొలి వీకెండ్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఆదివారం నాడు నైజాం వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్లలో ప్రేక్షకుల సందడి భారీగా కనిపించింది. ఆదివారం ఒక్క రోజే నైజాం ఏరియాలో ఈ చిత్రం ₹5.2 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో మొదటి మూడు రోజులకు కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు ₹14 కోట్ల మార్కును తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా (Best Performing Area) నిలిచింది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు దక్కే వీలుంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమా విజయానికి మంచి బలాన్ని చేకూర్చింది

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, తొలి వీకెండ్లో బలమైన పట్టు కనబరిచింది. ముఖ్యంగా ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’లో ఈ సినిమా భారీ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదు చేసింది. ఆదివారం ఒక్క రోజే (గడిచిన 24 గంటల్లో) ఏకంగా 3.11 లక్షలకు పైగా (311.33K) టికెట్లు బుక్ అయినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించడంతో ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో మంచి సంఖ్యలో హౌస్‌ఫుల్ షోలు కనిపించాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, తల్లీ కొడుకుల అనుబంధం చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి వీకెండ్లో అత్యుత్తమ వసూళ్లు నమోదు చేయడంతో, ఈ వారం వర్కింగ్ డేస్‌లో కూడా సినిమా నిలకడైన రన్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇదే రోజు విశాల్ నటించిన `మకుటం`(మగుడం) మూవీ కూడా విడుదలైంది. కానీ దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. సూర్య గత చిత్రాల్లోని యాక్షన్, మాస్ అంశాలకు భిన్నంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడేస్తుంది. మమితా బైజు నటన కూడా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీని ఫలితంగా, సినిమా విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు పోటీగా ఆగస్టు 14న విడుదలైన విశాల్ 'మకుటం' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'ఈట్టి', 'ఐంగరన్' చిత్రాల దర్శకుడు రవి అరసు మొదట ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేశారు. కథ, స్క్రీన్‌ప్లే పనుల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నటుడు విశాల్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విడుదలైనప్పటి నుంచి 'మకుటం' సినిమాకు ఎక్కువగా నెగటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నిల్క్ డేటా ప్రకారం, ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఒకవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రోజూ రూ.20 కోట్లకు పైగా వసూలు చేస్తూ రూ.110 కోట్ల
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది ‘కరుప్పు’తో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన తాజాగా ‘ విశ్వనాథ్ అండ్ సన్స్ ’తో మరో బిగ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి ఆట నుంచే యునానిమస్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని సరికొత్త సంచలనాన్ని నమోదు చేసింది.రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అధిగమించింది. మాస్ ఎలిమెంట్స్ లేకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఇంత తక్కువ టైమ్‌లోనే వంద కోట్ల క్లబ్లో చేరడం సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధి మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపింది.* మెగాస్టార్ vs సూపర్ స్టార్... బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రభంజనంక్లీన్ ఎంటర్టైన్మెంట్, హృదయాలను హత్తుకునే బలమైన ఫ్యామిలీ ఎమోషన్ష్తో తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ అంతటా దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంపిణీదారులు అనేక ప్రాంతాల్లో అదనపు స్క్రీన్లను, ప్రత్యేక షోలను కేటాయిస్తున్నారు. ఆదివారం కూడా ఇదే

టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సిన సినిమా గురించి మాట్లాడారు. టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి, తాజాగా వచ్చిన సూర్య (Suriya) ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons)తో కూడా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌తో సంతోషంగా వెంకీ అట్లూరి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, చిత్ర విశేషాలను తెలుపుతున్నారు. ఇలాంటి ఓ ఇంటర్వ్యూలో రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేయాలనుకున్న ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఎందుకు పట్టాలెక్కలేదో వివరించారు. మెగాస్టార్‌తో అనుకున్న ప్రాజెక్ట్ గురించి వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్న మాట నిజమే. 80స్ కాలంలో పెరిగిన వ్యక్తిగా చెబుతున్నాను.. మెగాస్టార్ మాకు చిన్ననాటి ఆరాధ్య దైవం. అయితే ఆయన లాంటి పెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేయాలంటే సరైన సబ్జెక్ట్‌తో పాటు పూర్తిగా సంసిద్ధమై ఉండాలి. ఆ స్థాయి స్టార్‌ను, ఆ భారీ బడ్జెట్‌ను హ్యాండిల్ చేయడానికి దర్శకుడిగా నాకు ఇంకాస్త మెచ్యూరిటీ అవసరమనిపించింది. ఆ సబ్జెక్ట్, ఆయన ఇమేజ్ రెండింటికీ న్యాయం చేయగలమా అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు. కెరీర్లో అంచెలంచెలుగా ఎదగడంపైనే తనకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారిగా పెద్ద జంప్ తీసుకుంటే అనుభవలేమితో బడ్జెట్ వృధా అయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకే మొదటి మూడు సినిమాల బడ్జెట్లను నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చానని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కోసం

Vishwanath & Sons Collections : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ ఇటీవల ఆగస్టు 14న రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చాన్నాళ్ల తర్వాత సూర్య ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో రావడం, మమిత తన కామెడీ టైమింగ్ తో నవ్వించడం, మదర్ ఎమోషన్ తో ఏడిపించడంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. విశ్వనాథ్ & సన్స్ సినిమా రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అమెరికాలో ఆల్మోస్ట్ 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. Also See : Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో.. దీంతో సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్ & సన్స్ సినిమా దాదాపు 300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సూర్య కరప్పు, విశ్వనాథ్ & సన్స్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు
సౌతిండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ వర్సలైట్ యాక్టర్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. తెలుగులో వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టండన్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదం, సున్నితమైన కుటుంబ భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. చాలాకాలం తర్వాత సూర్య ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ డ్రామాలో కనిపించడం, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడంతో చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.* సంక్రాంతి బ్లాక్‌బస్టర్ లోడింగ్... లీవ్స్, హాలిడేస్ లేకుండా ర్యాంప్ ఆడేస్తున్న అనిల్ రావిపూడిబాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ. 74.47 కోట్ల గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో మొదటి రోజు రూ. 17.74 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు మరింత పుంజుకుని ఏకంగా రూ. 25 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మొత్తంగా ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 43.47 కోట్ల గ్రాస్ (సుమారు రూ. 37.60 కోట్ల నెట్) నమోదు చేసింది. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) రూ. 17 కోట్లు, తమిళనాడులో రూ. 18 కోట్లు, కర్ణాటకలో రూ. 5 కోట్లు, కేరళలో రూ. 3.50 కోట్లు సాధించి సాలిడ్ హోల్డ్ కనబరిచింది.* లక్షలాది మంది ఆకలి తీర్చిన ‘ఎన్టీఆర్ మీల్’ సర్వీస్ బంద్ఓవర్సీస్లో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.'విశ్వనాథ్ & సన్స్' కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 74.47 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు 'సాక్నిల్క్' వెల్లడించింది. విశేషమేమిటంటే.. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం స్వదేశంలోనే కాకుండా, ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అరుదైన మైలురాయిని చేరుకుంది.యూఎస్‌లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా 'విశ్వనాథ్ & సన్స్' సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే 5,05,710 టికెట్లు అమ్ముడవడం సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు ఒక్కరోజులో అమ్ముడవడం అసాధారణ స్పందనగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.ఈ చిత్రంలో సూర్య సరసన మామితా బైజు హీరోయిన్గా నటించగా, సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్

తమిళ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే రెండు భారీ విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, ఆయన తాజా సినిమాలు మంచి ఊరటను ఇస్తున్నాయి. ప్రస్తుతం సూర్య కెరీర్ మళ్లీ ఊపందుకోవడంతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. 2013లో విడుదలైన సింగం 2 తర్వాత సూర్యకు బాక్సాఫీస్ వద్ద కలిసిరాలేదు. వరుస పరాజయాలతో ఆయన కెరీర్ కొంత మందగించింది. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఆయన తన పాత ఫామ్‌ను తిరిగి అందుకున్నారు. ఈ క్రమంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ గణాంకాలను తిరగరాయడం విశేషంగా మారింది. కరుప్పు (వీరభద్రుడు) సినిమాతో సూర్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త మైలురాయిగా నిలిచింది. దీంతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ విజయంతో సూర్య బాక్సాఫీస్ వద్ద తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఇదిలా ఉండగా, ఆయన నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా భారీ విజయం దిశగా సాగుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కావడంతో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కును దాటి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. శనివారం నాటి మొదటి మరియు రెండో షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం సూర్య కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూర్య జోరు చూస్తుంటే, ఆయన స్టార్డమ్ మళ్లీ శిఖరాగ్రానికి చేరుకుందని

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ప్రీ-సేల్ గణాంకాలు పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం గత 24 గంటల్లోనే బుక్‌మైషో వేదికగా 5,05,710 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ భారీ రెస్పాన్స్‌తో సినిమా విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ క్లాస్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో కథాంశంపై ఉన్న నమ్మకంతో బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి. దీంతో సూర్య సరసన మమితా బైజు నటిస్తున్న ఈ చిత్రంపై క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఇదిలా ఉండగా రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ వంటి ప్రముఖ తారల నటన సినిమాకు అదనపు బలం చేకూర్చింది. కుటుంబ కథా చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రంపై విశ్లేషకులు కూడా సానుకూల ధోరణి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సూర్య మార్క్ ప్రదర్శన కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో తొలి రోజు వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉంది. టికెట్ బుకింగ్స్ వేగం చూస్తుంటే ఓపెనింగ్స్ విషయంలో కొత్త బెంచ్‌మార్క్ నమోదు కానుంది. ప్రేక్షకుల ఆదరణ ఇలాగే కొనసాగితే వీకెండ్ నాటికి సినిమా భారీ లాభాలను ఆర్జించే సూచనలున్నాయి. భవిష్యత్తులో సూర్య తన కెరీర్లో మరో హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండటంతో అన్ని వర్గాల నుండి స్పందన లభిస్తోంది. సినిమా విడుదలయ్యాక వసూళ్ల ప్రభంజనం మరింత పెరిగే అవకాశం

`కరుప్పు` విజయంతో మంచి జోరుమీదున్నారు సూర్య. ఆయన ఇప్పుడు `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో నటించారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నాగవంశీ నిర్మించారు. సాయి సౌజన్య మరో నిర్మాత. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, వైవా హర్ష, సునీల్ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి పాజిటివ్ టాక్ వస్తోంది. సూర్య ఖాతాలో మరో హిట్ పడింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్లని మేళవించి రూపొందించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తోంది. అయితే తమిళంతో పోటీగా తెలుగులోనూ ఆదరణ దక్కుతుంది. కలెక్షన్లు కూడా అలానే ఉన్నాయి. తమిళంలో చాలా వరకు నెగటివ్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ఆడియెన్స్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. రెండో రోజుల్లో రూ.74.47కోట్లు వసూలు చేసింది. 43.47కోట్ల ఇండియా గ్రాస్, సాధించగా, రూ.31కోట్లు ఓవర్సీస్లో రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.37.60కోట్ల నెట్ రాబట్టింది. మొదటి రోజు దీనికి ఇండియాలో రూ.17.74కోట్లు రాగా, రెండో రోజు రూ.25కోట్లు రాబట్టడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణలో రూ.17కోట్లు వచ్చాయి. తమిళనాడులో రూ.18కోట్లు వచ్చాయి. కర్నాటకలో ఐదు కోట్లు, కేరళాలో మూడున్నరకోట్లు వచ్చాయి. నార్త్ లో అరవై లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా తెలుగు వారికే ఎక్కువ కనెక్ట్ కావడం విశేషం. `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ సుమారు రూ.130కోట్లతో రూపొందింది. దీనికి థియేట్రికల్‌గా రూ.63కోట్ల బిజినెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.20కోట్లకు సేల్ చేశారు. అంటే ఇక్కడ నలభై కోట్ల గ్రాస్ రావాలి. తమిళనాడులో నలభై కోట్లకు అమ్మారు. అక్కడ రూ.80కోట్ల గ్రాస్ రావాలి. ఓవర్సీస్లో

ఒక సినిమా విజయాన్ని కేవలం మొదటి వారాంతపు వసూళ్లు, అమ్ముడైన టికెట్ల సంఖ్యతోనే అంచనా వేయడం సరికాదని ప్రముఖ నటుడు సూర్య అభిప్రాయపడ్డాడు. తన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన, సినిమా విజయానికి ఉండాల్సిన అసలైన నిర్వచనాన్ని వివరించాడు.ప్రస్తుత కాలంలో సినిమా విజయాన్ని కేవలం అంకెలతోనే కొలుస్తున్నారని, అయితే అది సంపూర్ణమైన కొలమానం కాదని సూర్య పేర్కొన్నాడు. "ఒక సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎంత లోతుగా నిలిచిపోయింది అనేదే ముఖ్యం. సినిమా వీక్షించిన తర్వాత ప్రేక్షకులు పొందే భావోద్వేగాలు, ఆ చిత్రంపై వారు జరిపే చర్చలే అసలైన విజయం" అని అన్నాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా తాలూకు ప్రభావం ప్రేక్షకుడితోనే కొనసాగాలని ఆయన ఆకాంక్షించాడు."ఒక సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత కూడా ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఆ కథకు, చిత్ర బృందం పడిన శ్రమకు దక్కిన నిజమైన గౌరవం అదే" అని సూర్య వివరించాడు.అదే సమయంలో, సినిమా వ్యాపార కోణాన్ని కూడా సూర్య ప్రస్తావించాడు. నిర్మాతలు, పంపిణీదారులు ఆర్థికంగా సురక్షితంగా ఉండాలంటే బాక్సాఫీస్ వసూళ్లు కూడా కీలకమేనని స్పష్టం చేశాడు. ప్రేక్షకుల ఆదరణ, వాణిజ్యపరమైన వసూళ్లు రెండూ సమపాళ్లలో లభించినప్పుడే ఏ సినిమా అయినా సంపూర్ణ విజయాన్ని అందుకున్నట్లు అవుతుందని పేర్కొన్నాడు

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. హీరో సూర్య మాట్లాడుతూ.. "మీరు చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. త్రివిక్రమ్ గారి ఆశీస్సులు, ప్రేమ, మద్దతు వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగవంశీ గారితో మరిన్ని సినిమాలు చేయాలని, మరిన్ని ఙ్ఞాపకాలు మూట కట్టుకోవాలని కోరుకుంటున్నాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. నేను తమిళనాడు, మమితా కేరళ, రవీనా గారు మహారాష్ట్ర. మేమందరం వివిధ

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి సూర్య గారికి పెద్ద ఫ్యాన్. సూర్య గారితో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య గారి మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, సూర్య గారితో ఫోటో దిగారు. ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య గారు ఒకరు. ఇండియాలో ఇద్దరే హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. గజినీలో సూర్య గారు పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయోత్సవ వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, హీరో సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ.. "కుటుంబ కథా చిత్రాల ప్రాముఖ్యతను ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ మరోసారి నిరూపించింది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్లు రెట్టింపు కావడం సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కథను, పాత్రలను రూపొందించిన దర్శకుడు వెంకీ అట్లూరికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొన్నాడుఅనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "భారతీయ చిత్ర పరిశ్రమలో వయసు తగ్గుతున్నట్లు కనిపించే అరుదైన కథానాయకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు సూర్య, మరొకరు మహేశ్ బాబు. సూర్యతో సినిమా చేయాలని నా భార్య ఎప్పటి నుంచో కోరుతోంది. త్వరలోనే ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను. సూర్య, కార్తీ ఇప్పుడు భాషా, ప్రాంతీయ భేదాలు దాటి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు" అని కొనియాడాడు.ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మామితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక బృందం నుంచి అద్భుతమైన సహకారం లభించిందని, సూర్య తన నటనా ప్రతిభతో సినిమాను మరో
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఫస్ట్ ఈ కథ విన్నప్పటి నుంచే ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి టైంలో కస్టపడి ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని సక్సెస్ ఫుల్ చేసినందుకు టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను. త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా భార్య సూర్యకి పెద్ద ఫ్యాన్. ఆమె సూర్యతో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా తను సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, కలిసి ఫోటో దిగారు. బేసిక్ గా ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య ఒకరు. నాకు తెలిసి ఇండియాలో ఇద్దరు హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకరు సూర్య, ఇంకొకరు మహేష్ బాబు'' అని నవ్వుతూ అన్నారు.''గజినీ'లో సూర్య పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు

భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్ వైరల్ అవుతోంది. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). తాజాగా ఆయన సూర్య (Suriya) హీరోగా నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వెంకీ తనకు చెప్పినప్పటి నుంచి ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంత చక్కగా సినిమా తీసి విజయం సాధించినందుకు చిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సూర్యతో కలిసి కచ్చితంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నానని, ఆయనకు నచ్చే కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. సూర్యతో సినిమా చేయాలని తన భార్య నుంచి ఒక డిమాండ్ ఉందని తెలిపారు. సాధారణంగా సితార బ్యానర్లో జరిగే షూటింగ్‌లకు రాని తన భార్య, సూర్యను కలవడానికి స్వయంగా సెట్‌కి వచ్చి ఫొటో తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరని, ఒకరు సూర్య అయితే మరొకరు మహేష్ బాబు అని కొనియాడారు. ‘గజిని’ చిత్రంలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పాత్ర అని, అలాంటి

సూర్య(Suriya) హీరోగా వెంకీ అట్లూరి(venky atluri) దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పట్టణ ప్రాంతాలు, మల్టీప్లెక్స్‌లు, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో విశేష స్పందన లభించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్లు తమిళ వెర్షన్ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ సినిమా కలెక్షన్లకు బలమైన ఊతంగా మారినట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన హాలీడే కారణంగా రెండో రోజు మార్నింగ్ నుంచే అనేక ఏరియాల్లో ఆక్యుపెన్సీ పెరిగినట్లు సమాచారం. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కేంద్రాల్లో ఎక్స్ట్రా షోలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విదేశీ మార్కెట్లోనూ తెలుగు వెర్షన్‌కు మంచి ఆదరణ లభిస్తుండగా, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కలగలిపిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సూర్యతో పాటు రాధిక(Radhika), మమిత బైజు(Mamitha Byju) యాక్టింగ్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మాణ విలువలు కూడా సినిమాకు మరింత బలం చేకూర్చాయని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇదే ఊపు కొనసాగితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath and Sons). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా శుక్రవారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతోంది. మొదటి రోజు నుంచే ప్రేక్షకులలో అదిరిపోయే రెస్పాన్స్ ను సాధించడంతో .. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ కూడా ఈసినిమా సాధించింది. ఇండస్ట్రీ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) అందించిన లెక్కల ప్రకారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఇండియాలో మొదటి రోజు రూ. 17.51 కోట్ల గ్రాస్ కలెక్సన్స్ ను, 15. 15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ దాదాపు రూ. 27.51 కోట్లుగా నమోదు కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 5,034 షోలతో మొదలైన ఈసినిమా.. ఇండియా వ్యాప్తంగా దాదాపు 4,361 షోలలో ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకు తెలుగులో 46 శాతం, తమిళంలో 40 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. మొదటి రోజు వసూళ్లలో తమిళ వెర్షన్ అత్యధిక సహకారాన్ని అందించింది. తమిళంలో 2,679 షోల నుంచి 40 శాతం ఆక్యుపెన్సీతో దాదాపు రూ. 9.15 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది సినిమా. మరోవైపు, తెలుగు వెర్షన్ 1,682 షోల ద్వారా దాదాపు రూ. 6 కోట్ల నెట్ వసూలు చేసింది. విశేషమేమిటంటే, తెలుగు వెర్షన్ తమిళం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని (46 శాతం) నమోదు చేయడం గమనార్హం. తమిళ ప్రేక్షకులకంటే తెలుగువారే ఈసినిమాను ఎక్కువగా ఆధరిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపించారు. కుటుంబంలో తలెత్తిన ఒక సంక్షోభం తర్వాత అతని జీవితం ఎలా మారింది అనేది కథ. సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించగా.. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు

నటీనటులు : సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, సుధ, రఘుబాబు, నాజర్ తదితరులు. దర్శకత్వం : వెంకీ అట్లూరి సంగీతం : జి. వి. ప్రకాష్ కుమార్ నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి ఎడిటింగ్ : నవీన్ నూలి సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం. సంజయ్ విశ్వనాథ్ (సూర్య) బిజినెస్ మెన్. అండ్ పిస్టల్ షూటర్ కూడా. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. ఐతే, 40 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ సంజయ్ ఒంటరిగానే ఉంటాడు. అతని తల్లి (రాధిక) పెళ్లి చేసుకోమని బలంవంతం చేస్తూ ఉంటుంది. తల్లి కోసం సంజయ్ సరోగసి ద్వారా బాబుకి జన్మని ఇస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన కుమారుడి బాధ్యతలను ఎలా చూసుకున్నాడు. ఈ క్రమంలో కొడుకుకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావడంతో మమితా బైజు సంజయ్ జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది ?, అసలు ఆమె ఎవరు ?, 22 ఏళ్ల మ్యాడీ (మమితా బైజు) – 40 ఏళ్ల సంజయ్ తో ఎలా ప్రేమలో పడింది?, తన ప్రేమను మ్యాడీ సంజయ్‌కు చెప్పిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి?, అసలు సంజయ్, మ్యాడీ ప్రేమను ఒప్పుకున్నాడా? లేదా ? అనేది మిగిలిన కథ. ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో సూర్య చాలా సెటిల్డ్ గా కనిపించాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూర్య మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. సూర్య నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్

సినిమా పేరు & తారాగణం సినిమా పేరు: విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టండన్ తదితరులు దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కథ : సినిమా కథలోకి వెళితే, సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక అత్యంత ధనవంతుడైన ఇండస్ట్రియలిస్ట్. అంతేకాదు, గతంలో ఓ ఒలింపిక్స్ పోటీలో గన్ సరిగ్గా పని చేయక తన కెరీర్ మలుపు తిరిగిన నేపథ్యం ఉన్న మాజీ షార్ప్‌షూటర్. ఇప్పుడు అతను ఒక కార్పొరేట్ ప్రపంచంలో క్రైసిస్ హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. జీవితంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే తన తల్లి కోరిక మేరకు, ఒక బిడ్డకు తండ్రి కావాలని అతను సరోగసి మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రయాణంలో అనుకోకుండా అతని జీవితంలోకి మ్యాడీ (మమిత బైజు) ప్రవేశిస్తుంది. మొదట ఒక సాధారణ పరిచయంగా మొదలైన వీరిద్దరి బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. సంజయ్ తన తల్లి కోరికను ఎలా నెరవేర్చాడు? సరోగసి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? విదేశాల నుంచి వచ్చిన మ్యాడీని సంజయ్ తన జీవిత భాగస్వామిగా అంగీకరించాడా? ఈ ప్రయాణంలో కుటుంబం ఎదుర్కొన్న భావోద్వేగాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథాంశం. విశ్లేషణ: డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎప్పుడూ కూడా కాంటెంపరరీ అర్బన్ ఫ్యామిలీ డ్రామాలను చాలా స్టైలిష్‌గా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారు. ఈ చిత్రంలో కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకుని, ఒక సున్నితమైన పాయింట్‌ను ఎంచుకుని కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభంలోనే సంజయ్ విశ్వనాథ్ పాత్రను పరిచయం చేసే

వర్సటైల్ యాక్టర్ సూర్య, గ్లామరస్ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఇక ప్రీమియర్స్, మార్నింగ్ షో చూసిన జనాలు ఎక్స్ (ట్విట్టర్) లో తమ రివ్యూలను షేర్ చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమాకు ఎక్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో వెంకీ అట్లూరి మళ్లీ తన మార్క్ చూపించారని ఆడియన్స్ చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా కూల్‌గా, ఫన్‌గా సాగిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిమిషాలు కథ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా, ఆ తర్వాత మంచి పేస్ అందుకుంది. హాస్పిటల్ సీక్వెన్స్, ట్రిప్ కామెడీ, హోటల్ ఫైట్ సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇందులో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య ప్రాణం పోశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. గజినీలోని సంజయ్ రామస్వామి పాత్ర ఎంత ఐకానిక్‌గా ఉందో, ఈ సంజయ్ విశ్వనాథ్ రోల్ కూడా అంతే రేంజ్లో ఉందంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రను సూర్య దాటేసారని కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాధిక, మమితా బైజు, సూర్య మధ్య ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా నేచురల్‌గా వర్కవుట్ అయ్యాయి. మమితా బైజు లుక్స్ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండి క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెబుతున్నారు. 'లక్కీ భాస్కర్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి మళ్లీ బలమైన కథతో వచ్చారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ పీక్స్‌లో ఉందని రివ్యూస్ వస్తున్నాయి. మన టాలీవుడ్ క్లాసిక్ హిట్స్ అయిన అలా వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ఎమోషన్స్ ఈ సినిమాలో మళ్లీ చూశామని ఆడియన్స్ ఫీలవుతున్నారు. ఆ ఎమోషన్స్‌ను వెంకీ అట్లూరి తనదైన

సూర్య చివరగా `కరుప్పు` చిత్రంతో విజయాన్ని అదుకున్నారు. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకొని కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో తెలుగు సినిమా `విశ్వనాథ్ అండ్ సన్స్` చేశారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటించగా, రాధిక శరత్ కుమార్, రవీనా టండన్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 14)న తెలుగు, తమిళంలో విడుదలైంది. మరి సూర్య తెలుగు మూవీ ఆకట్టుకుందా? ఆయనకు మరో హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సంజయ్ విశ్వనాథ్(సూర్య) బిగ్ కార్పొరేట్ టైకూన్. చిన్నప్పట్నుంచి ఫిస్టల్ క్రీడలో రాణించాలనుకుంటాడు. నలభై ఏళ్ల వయసులో ఛాంపియన్‌గా నిలుస్తాడు. దీంతో ఆయనేంటో అందరికి తెలుస్తుంది. అదే సమయంలో దేశంలో ఎవరైనా మ్యానేజ్ చేయగల మోస్ట్ ఇన్ఫ్లూయెన్స్ డ్ పర్సన్ కూడా. అయితే నలభై దాటినా కూడా పెళ్లి చేసుకోడు. దానికి కారణం తన నాన్న అమ్మ నిర్మలమ్మ(రాధికా శరత్ కుమార్) ని కాకుండా నటి అంజలి(రవీనా టండన్)ని పెళ్లి చేసుకుంటాడు. దీంతో తమని దూరం పెట్టడంతో సంజయ్ బాధపడతాడు. తండ్రిని, అంజలి ఫ్యామిలీని హేట్ చేస్తాడు. అమ్మనే సర్వస్వంగా బతుకుతాడు. అయితే జీవితంలో అన్నీ సాధించిన తనకు పెళ్లి చేయాలని అమ్మ కోరుకుంటుంది. కానీ సంజయ్ నో చెబుతాడు. కానీ అమ్మ కోరిక మేరకు సరోగసి ద్వారా అబ్బాయికి తండ్రి అవుతాడు. అతను చిన్నప్పుడే బోన్ మ్యారోకి సంబంధించిన లోపంతో బాధపడతాడు. దానికి తన సరోగసి మదర్ కావాల్సి వస్తుంది. ఆమెనే మ్యాడీ(మమితా బైజు). డబ్బు కోసం ఆ పని చేస్తుంది. తనకు ఎవరూ లేరు. ఇప్పుడు సంజయ్ రిక్వెస్ట్ మేరకు ఆమె బోన్ మ్యారో రీప్లేస్‌మెంట్‌కి ఓకే చెబుతుంది. దీనికోసం సంజయ్ ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో సంజయ్‌కి ఆమె

Vishwanath and Sons OTT : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సంయుక్తంగా నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ నేడు (ఆగస్టు 14న) రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోట ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. Vishwanath and Sons : ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా? ఇక ఈ చిత్రం ఏ ఓటీటీలోకి రానుంది అనే విషయం తెలిసిపోయింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర టైటిల్ కార్డులో వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైన నెల రోజుల తరువాతనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు

Vishwanath and Sons : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మమితా బైజు కథానాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా నేడు (ఆగస్టు 14న) తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య అదరగొట్టాడని చెబుతున్నారు. ఆయన సెటిల్డ్ అండ్ సాలిడ్ పెర్ఫార్మన్స్ మూవీని మరో లెవల్ కు తీసుకు వెళ్ళిందట. సూర్య, మమిత జంట చేసే సందడి, వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. Prabhas : మరోసారి రాముడిలా ప్రభాస్..? #VishwanathAndSons - Just Wait For this sequence in the First half between Suriya, Mamitha & Radhika !! The theatre was Bursted with Non-Stop laughter for Atleast 10-15 Mins😂🔥 VenkiAtluri's Writing & comical sence peaked max😁 It was so surprising that #Suriya has agreed for… — AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026 Good first half Decent second half Better than the last 10 Suriya movies combined, including Karuppu, and a better movie from a Tamil hero in the last 3 years. #VishwanathAndSons

మూడు వారాల వ్యవథిలో జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన నాలుగు చిత్రాల విడుదల. ఒకే రోజున వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం' సినిమాలు. ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ మేనల్లుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినా... తొలి చిత్రం 'వేసవి'తోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఆ తర్వాత వరుస చిత్రాలకు సంగీతం అందిస్తూనే హీరోగా మారిపోయాడు. తమిళనాట జీవీ ప్రకాశ్ కుమార్‌కు హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయినా సంగీతాన్ని మాత్రం పక్కన పెట్టలేదు జీవీ. హీరోగా అడపా దడపా నటిస్తూ, మ్యూజిక్ డైరెక్షన్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. అనిరుధ్ ప్రభంజనం ఇప్పుడు తమిళనాట సాగుతున్నా, సాయి అభ్యంకర్ వేవ్ కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నా... జీవీ ప్రకాశ్ మాత్రం తన పని తాను చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళుతున్నాడు. నిజానికి గతంలో కంటే ఇప్పుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఎక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. చాలా వేగంగా వంద సినిమాల మైలురాయిని కూడా ఈ యువ సంగీత దర్శకుడు దాటేశాడు. విశేషం ఏమంటే గత నెల 30 నుంచి ఈ నెల 21 వరకూ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చిన నాలుగు సినిమాలు తెలుగులో వచ్చాయి, వస్తున్నాయి. జూలై 30న జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన 'శ్రీనివాస మంగాపురం'కు జీవీ సంగీతం అందించాడు. సినిమాకు ప్రతికూల ఫలితం వచ్చినా, మూవీ ఓ మేరకు ఆడిందంటే... అది జీవీ ప్రకాశ్ సంగీత ప్రభావమే. అలానే శుక్రవారం జనం ముందుకు రాబోతున్న రెండు తమిళ చిత్రాలకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. అందులో ఒకటి సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కాగా, మరొకటి విశాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'మకుటం'. ఈ రెండు కూడా తెలుగులో డబ్ అయ్యి విడుదలవుతున్నాయి. ఇదే నెల 21న రాబోతున్న రవితేజ 'ఇరుముడి'కి సంగీతం అందించింది కూడా జీవీ

వర్సటైల్ స్టార్ హీరో సూర్య, యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్లను అందించే యువ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య, యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్లను అందించే యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons). 'సార్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అటు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సూర్య హీరోగా నటిస్తుండటంతో మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని రూ. 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే అసలు మేజిక్ ఇక్కడే జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 90 కోట్లకు అమ్ముడుపోగా.. డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్-థియేట్రికల్ హక్కులు రూ. 125 కోట్లు పలికాయి. అంటే మొత్తంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూపంలోనే ఈ చిత్రం రూ. 215 కోట్లు రాబట్టింది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మేకర్స్‌కు ఏకంగా రూ. 85 కోట్ల భారీ టేబుల్ ప్రాఫిట్ దక్కింది. సూర్య (Suriya) ఇటీవల నటించిన 'కరుప్పు' చిత్రం బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 320 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఆ సూపర్ హిట్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ ఊపును ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో కూడా కంటిన్యూ చేస్తానని సూర్య చాలా ధీమాగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్ యూట్యూబ్‌లో

స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌ను పురస్కరించుకుని ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి నెలకొంది. ఆగస్టు 14 గురువారం ఒక్కరోజే ఏడు కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. విభిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ వారం చిత్రాల వివరాలు: తమిళ హీరో సూర్య కథానాయకుడిగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ (సూర్య) జీవితంలో కుటుంబ భావోద్వేగాలు, అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సీనియర్ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశి విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రల్లో నటించారు. అల్లు సినిమాస్‌లో పెయిడ్ ప్రిమియర్లు జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మించగా, దుషార విజయన్, అంజలి కథానాయికలుగా నటించారు. విశాల్ విభిన్న గెటప్పులలో కనిపించబోతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఆగస్టు 14న విడుదల కానుంది. వీటితో పాటు వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ‘పల్లాబురుసు’, ‘హుషార్ పిట్టలు’, ‘ఆవారాపన్ 2’, మరియు ‘బట్వారా 1947’ చిత్రాలు కూడా అదే రోజు థియేటర్లలో విడుదలవుతున్నాయి. మొత్తం ఏడు చిత్రాలు ఒకే రోజు పోటీపడుతుండటంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాల్సి ఉంది

Suriya Vishwanath and Sons: సూర్య హీరోగా నటించిన విశ్వనాథ్ & సన్స్ మూవీ ఈ నెల 14న థియేటర్స్‌లో సందడి చేయనుంది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దర్శకుడు వెంకీ అట్లూరి తమ కుటుంబానికి చాలా సన్నిహిత మిత్రుడు అని చెప్పారు. వెంకీ నాన్న అట్లూరి సుబ్బారావు అంకుల్ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు

నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఎప్పుడు మాట్లాడినా కాస్త ఓపెన్ గా, ఓవర్ గా మాట్లాడతారనే విషయం అందరికీ తెలిసిందే. అది ఆయన తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆయన నైజం అది. తాజాగా మరోసారి ఆయన అంతే ఓపెన్ గా మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే ఓపెన్ ఛాలెంజ్ లాంటిది అనుకోవచ్చు. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్ లో మాట్లాడారు నాగవంశీ. ఈ సినిమాతో పాటు సూర్యను చాలా విధాలుగా పొగిడారు. వాటన్నింటి కంటే ఆయన ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ చాలామందిని ఆకర్షించింది, మరెంతో చర్చకు దారితీసింది. “నేను చాలా రోజుల తర్వాత స్టేజ్ పైన నమ్మకంగా ఓ సినిమా బాగుందని చెబుతున్నాను. ఇన్నాళ్లూ నేను తగ్గాను, భయపడ్డాను. కానీ చాలా రోజుల తర్వాత ధైర్యంగా, సభాముఖంగా చెబుతున్నాను. సినిమా చాలా చాలా బాగుంది.” సినిమాల్లో వంకలు వెతకడం సహజమని, ఆ చిన్నచిన్న వంకల గురించి తను ప్రస్తుతం చర్చించలేనని, ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా కచ్చితంగా 90 శాతం తృప్తినిస్తుందని చెబుతున్నాడు. నాగవంశీ స్పీచ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. “వార్-2” సినిమా నుంచి నాగవంశీ ఏం మాట్లాడినా దాన్ని ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే టైమ్ కు ఇలానే మాట్లాడి ఎన్టీఆర్ అభిమానుల్ని ఫూల్స్ చేశావంటూ నాగవంశీని ట్రోల్ చేస్తున్నారు. ఈసారి నాగవంశీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఎఁత నిజం అవుతుందో త్వరలోనే తేలిపోతుంది

పైన ఫోటోలో హీరో సందీప్ కిషన్ పక్కన కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. స్టా్ర్ హీరోలతో అతడు తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం విశేషం. అతడు మరెవరో కాదు తెలుగు చిత్రసీమలో తనదైన కథలతో విలక్షణమైన ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు.. దుల్కర్ సల్మాన్ హీరోగా ఆయన తెరకెక్కించిన లక్కీ భాస్కర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ రచయితగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ..యాక్టింగ్ గురించి అడగ్గా.. నిర్మాత నాగవంశీ స్పందిస్తూ వెంకీ ఒకప్పుడు హీరో అని గుర్తు చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం స్నేహగీతం. ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వెంకీ అట్లూరికి చిన్నప్పటి నుంచి రచనపై చాలా ఆసక్తి. అదే క్యూరియాసిటీతో సినీరంగంలోకి అడుగుపెట్టి జ్ఞాపకం అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాకు అతడే మైనస్ అనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత స్నేహగీతం అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ సైతం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నటనకు స్వస్తీ చెప్పి దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత చిత్రాలకు డైలాగ్స్ అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన దర్శకుడిగా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya), డైరెక్టర్ వెంకీ అట్లూరి(venky Atluri)పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విశ్వనాథ్ & సన్స్(Vishwanath & Sons) ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమా చూసిన తర్వాత వెంకీ అట్లూరితో తప్పకుండా వర్క్ చేయాలని తాను డిసైడ్ అయినట్టు వెల్లడించారు. డైరెక్టర్ వర్క్ తనను ఎంతగా ఆకట్టుకుందో సూర్య మాటల్లో స్పష్టంగా కనిపించింది. లక్కీ భాస్కర్ తర్వాత ఆయన ఏ స్క్రిప్ట్ తీసుకొచ్చినా ఓకే చెప్పాలని డిసైడ్ చేసుకున్నానని, ఎందుకంటే ఆయనతో వర్క్ చేయాలని తాను మానిఫెస్ట్ చేస్తున్నానని, తర్వాత ప్రొడ్యూసర్ వంశీ(naga vamsi) నుంచి ఫోన్ వచ్చిందని, వంశీ గారు ఫోన్ చేసి వెంకీ గారి డేట్స్ ఉన్నాయని చెప్పారని, కానీ మొదట అనుకున్నది పూర్తిగా వేరే బయోపిక్ కథ అని సూర్య అన్నారు. ఈ కామెంట్స్ వెంకీ అట్లూరిపై ఆయనకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ హీరోలు సాధారణంగా కథ, పాత్ర, మార్కెట్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఒక ప్రాజెక్ట్‌కు అంగీకరిస్తారు. అలాంటి సమయంలో కథ వినకముందే డైరెక్టర్ తర్వాతి స్క్రిప్ట్‌కు ఓకే చెప్పాలనుకున్నానని సూర్య చెప్పడం విశేషంగా మారింది. ఇదే సందర్భంలో ఆయన ప్రస్తావించిన వెంకీ డేట్స్, బయోపిక్ కథ అంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది