
కళ్లెదుటేప్రళయం.. ప్రాణభయంతో పరుగులు, కిందపడ్డా ఆగని ఫోన్ రికార్డింగ్
నేపాల్లో సంభవించిన భారీ వరద బీభత్సానికి సంబంధించిన ఒక హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బురద నీటి ప్రళయం వేగంగా దూసుకొస్తుండగా, ఒక వ్యక్తి దాన్ని తన ఫోన్లో చిత్రీకరిస్తూ ప్రాణభయంతో పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అతను కిందపడిపోయినా, ఫోన్ మాత్రం రికార్డింగ్ ఆపకుండా అక్కడి భయానక వాతావరణాన్ని రికార్డ్ చేస్తూనే ఉంది.ఈ వీడియో ప్రారంభంలో, కొందరు వ్యక్తులు ఒక వరద కాలువ సమీపంలోని పొదల వద్ద నిలబడి ఉండగా, బురద నీటి ప్రవాహం గోడలా దూసుకురావడం కనిపిస్తుంది. ప్రమాదాన్ని పసిగట్టిన వారు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కెమెరా వేగంగా కదులుతూ, వారు చెట్లు, పొదల గుండా పరుగెత్తిన దృశ్యాలను రికార్డ్ చేసింది. చివరకు ఆ ఫోన్ కిందపడిపోయి, రాతి నేలను చూపిస్తూ రికార్డింగ్ కొనసాగించింది.ఈ వీడియోలో ఉన్నవారు వరదలో కొట్టుకుపోయి చనిపోయారని, వారి చివరి క్షణాలను ఈ ఫోన్ రికార్డ్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వీడియో ప్రామాణికతను గానీ, ఇది ఎక్కడ జరిగిందనే విషయాన్ని గానీ స్వతంత్రంగా ధ్రువీకరించలేమని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వీడియోలో ఎవరైనా వరదలో కొట్టుకుపోయినట్లు స్పష్టంగా కనిపించకపోవడం గమనార్హం.నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో ఆగస్టు 26న హిమానీనదం (గ్లేసియర్) కూలిపోవడం లేదా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఆకస్మిక వరదలు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ ప్రకారం, సోమవారం నాటికి మృతుల సంఖ్య 903కి చేరింది. మరో 4,247 మంది గల్లంతు