విజయవాడ - గుడివాడ రైలు మార్గంలోప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై నో టెన్షన్
విజయవాడ - గుడివాడ మార్గంలోని బ్రాంచ్ లైన్లో ఒక్కసారి ప్రయాణించామంటే ఇక జీవితంలో అది మరచిపోలేము. ఒక్కసారి హాల్టింగ్ పడితే ఇక మనం ఎప్పుడు వెళ్తామో కూడా తెలియని పరిస్థితి. ఎన్ని గంటలైనా అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేసిన వారికే తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం అది సింగిల్ లైన్ కావడమే.. ఎదురుగా మరో రైలు వస్తే ఎక్కడపడితే అక్కడ నిలిపేశారు. విజయవాడ వచ్చేశాము అనుకునేలోపే రాత్రివేళ్లలో ఔటర్లలో రైళ్లు నిలిపేసేవారు. అయితే, ఇకపై ఎలాంటి టెన్షన్ ఉండదు.. ఎందుకంటే ఇప్పటి వరకు సింగిల్ లైన్ ఉన్న ట్రాక్‌ను, డబుల్ లైన్ చేసేశారు.సాధారణంగా విజయవాడ నుంచి గుడివాడకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటన్నర, ప్యాసింజర్ అయితే మూడు గంటలపైనే సమయం పట్టేది. ఇకపై అంత సమయం వేచి చూడాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సింగిల్ లైన్ ఉండగా.. ఎట్టకేలకు రూ. కోట్లు వెచ్చించి డబుల్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నట్టయింది. ప్రస్తుతం ఎంఈఎంయూ రైళ్లు గంట వ్యవధిలో వెళ్తుండగా, ఎక్స్‌ప్రెస్ రైళ్లు 45 నిమిషాలకు గమ్య స్థానం చేరుకుంటున్నాయి.READ ALSO అనకాపల్లికి గోదావరి.. వెలిగొండ పూర్తి, ఇక 'పోలవరం' గేట్లెత్తనున్న చంద్రబాబు!డబుల్ లైన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో బ్రాంచ్ లైన్ పరిధిలోని మెయిన్ రైల్వే స్టేషన్లలో అదనంగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సరుకు రవాణాకు అదనపు రైళ్లను నడిపి ఆదాయాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్రాంచ్ లైన్లో గుడివాడ, మచిలీపట్నం, నరసాపురం, భీమవరం, నిడదవోలు రైల్వే స్టేషన్లను పెంచనున్నారు.మొత్తానికి డుబల్ లైన్ వేయడంతో ప్రయాణికుల కష్టాలు తీరిపోయాయనే చెప్పొచ్చు. గతంలో గుడివాడ వెళ్లాలంటే విజయవాడ నుంచి మూడు గంటలకు పైగానే సమయం పట్టేదని, ఎక్కడ పడితే అక్కడ రైలు ఆపేసే వారని ప్రయాణికులు తమ బాధను చెప్పుకున్నారు. బ్రాంచ్ లైన్ రాకతో