సామాన్యులకు అవన్నీ ఉచితమే.. రూ.2000 మించిన లావాదేవీల ఛార్జీలపై కేంద్రంక్లారిటీ
UPI MDR Charges: దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలే అధికంగా ఉంటాయి. నిత్యం కోట్ల మంది యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ యూపీఐ వినియోగిస్తున్నారు. సామాన్యులు సైతం ఎంతో సులభంగా, ఉచితంగా ఒకరి నుంచి ఒకరికి డబ్బులు పంపించగలుగుతున్నారు. అయితే, ఇకపై రూ. 2000 లకు మించి డబ్బులు పంపిస్తే ఛార్జీలు విధిస్తారన్న వార్తలు సామాన్యులతో పాటు వ్యాపారులను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని వెల్లడించింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకోస్తోందని, అందుకు పార్లమెంట్ సైతం ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. సాధారణ యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ( No Charges For UPI Users ) ఉండవని స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్లన్నీ యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది. అలాగే వ్యాపారులకు సంబంధించి సైతం ఎక్కువ శాతం యూపీఐ ట్రాన్సాక్షన్లు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. భవిష్యత్తులో ఎండీఆర్ (Merchant Discount Rate) అములోకి వచ్చినా అందరిపై ఏకపక్షంగా ఉండదని స్పష్టం చేసింది.మర్చంట్ ట్రాన్సాక్షన్లపై నామమాత్రపు ఎండీఆర్ ఛార్జీలు మాత్రమే ఉంటాయని తెలిపింది. ఇది డెబిట్, క్రెడిట్ కార్డుల ఎండీఆర్ కంటే చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. ఎంపిక చేసిన డిజిటల్ ట్రాన్సాక్షన్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు విధించేందుకు బ్యాంకులకు, పేమెంట్ సర్వీసెస్ కంపెనీలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జీలు విధింపును అడ్డుకునే పాత రూల్స్ తొలగించారు. ఈ క్రమంలో యూపీఐ పేమెంట్లు చేస్తే ఇకపై ఛార్జీలు కట్టాలని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో
