
ఫిబ్రవరి 28 నుంచి జులై వరకు.. ట్రంప్-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామాలు ఇవే
US-Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఇరాన్‌తో మొదలైన యుద్ధం కొన్ని నెలల వ్యవధిలోనే సరికొత్త మలుపులు తిరిగింది. ప్రారంభంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ యుద్ధం.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే హోర్ముజ్ జలసంధి నియంత్రణ చుట్టూ తిరుగుతోంది. 2026 ఫిబ్రవరి 28న అణుస్థావరాలపై దాడులతో మొదలైన ఈ యుద్ధం.. ప్రస్తుతం చమురు రవాణా మార్గాలను అడ్డుకునే సమరంగా ఎలా మారిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.ఫిబ్రవరి 28: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభం 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట భారీ వైమానిక దాడులకు దిగాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే పరమావధిగా జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ అణు ప్రాజెక్టులు,మిస్సైల్ సైట్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ఆ దేశ పాలనా వ్యవస్థకు కోలుకోలేని దెబ్బగా మారింది. దీనిక ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడటమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజు జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ మార్గం గుండానే సాగుతుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.మార్చి-ఏప్రిల్: హోర్ముజ్ సంక్షోభం, తాత్కాలిక సీజ్ ఫైర్ మార్చి నెలలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడటంతో అంతర్జాతీయ షిప్పింగ్ రంగం నిలిచిపోయింది. దీనికి ప్రతిచర్యగా అమెరికా నౌకాదళం రంగంలోకి దిగి ఇరాన్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్, చైనాల మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 7-8 తేదీల్లో రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరింది. ఆ తర్వాత పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్