నెతన్యాహుపైట్రంప్ గుస్సా

లెబనాన్ మీద దాడులను ప్రస్తావిస్తూ బూతులు లంకించుకున్న అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్, జూన్ 2: లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ఏకంగా బూతులు లంకించుకున్నారు. ‘పిచ్చోడిలా వ్యవహరిస్తున్నావ్.. నిన్ను అందరూ అసహ్యించుకుంటున్నారు.. నీ వల్ల ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు.. నేనే గనక లేకపోతే జైల్లో ఉండేవాడివి’ అంటూ రంకెలు వేసినట్లుగా అమెరికా అధికారవర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా వెల్లడించింది. సంభాషణ మధ్యలో బూతులు కూడా వాడినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహుపై విచారణ జరిగితే ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాన్ని ప్రస్తావిస్తూ.. జైలుకు వెళ్లకుండా తాను కాపాడానని ట్రంప్ పేర్కొన్నట్లు సమాచారం. హెజ్బొల్లాను అంతం చేసే పేరుతో ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ ఎత్తున బాంబుదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ ఈ దాడులు ఆపకపోతే తాము శాంతి చర్చలను నిలిపివేస్తామని ఇరాన్ తేల్చిచెప్పటంతో.. ట్రంప్ నెతన్యాహుకు ఫోన్ చేసినట్లు సమాచారం. దీనిపై ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘లెబనాన్ మీద దాడలు ఆపాలని నెతన్యాహుకు చెప్పాను. సైన్యాన్ని వెనక్కి పిలిపించటానికి నెతన్యాహు అంగీకరించారు. అందుకు కృతజ్ఞతలు. మరోవైపు, హెజబుల్లా ప్రతినిధులతో కూడా మాట్లాడా. వారు కూడా ఇజ్రాయెల్ మీద దాడుల నిలిపివేతకు అంగీకరించారు’ అని వెల్లడించారు. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ.. హెజ్బొల్లా దాడులు కొనసాగితే తాము కూడా కొనసాగిస్తామని ట్రంప్‌కు చెప్పానన్నారు. అయితే, ట్రంప్‌కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా లెబనాన్ మీద ఇజ్రాయెల్ మంగళవారం కూడా దాడులు కొనసాగించింది.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News