
భీమవరంశ్రీ మావుళ్ళమ్మ గుడి మార్గంలో తీవ్రట్రాఫిక్ సమస్య
Bhimavaram: భీమవరం శ్రీ మావుళ్ళమ్మ గుడి మార్గంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య! Bhimavaram: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి గుడి మార్గంలో నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రహదారిపైనే పళ్ల వ్యాపారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ రహదారిపై రోడ్డు పక్కనే భారీ సరుకు రవాణా వాహనాలను నిలిపి ఉంచి, అక్కడికక్కడే ఇతర పళ్ల కొట్లకు సరుకులను రవాణా (అన్లోడింగ్ & లోడింగ్) చేస్తున్నారు. దీనివల్ల ప్రశాంతంగా వెళ్లాల్సిన దారిలో నిత్యం కిక్కిరిసిన వాహనాలతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. పళ్ల దుకాణాల ముందు వ్యాపార వాహనాలు ఆపి ఉంచడం వల్ల దారిన పోయే కాలినడక బాటసారులకు, ఇతర వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు మరియు అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్య మళ్లీ మొదటికి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రద్దీగా ఉండే ఆలయ రహదారిపై భారీ వాహనాల నిలుపుదలను వెంటనే నిషేధించి, పళ్ల రవాణా వ్యాపారాన్ని ప్రత్యామ్నాయ స్థలానికి తరలించాలని భక్తులు, ప్రజలు మున్సిపల్, పోలీస్ అధికారులను కోరుతున్నారు