
ప్రేమత్యాగం.. పగతోప్రతీకారం ఓటీటీలో దుమ్మురేపుతున్నథ్రిల్లర్ మూవీ.. తెగ చూస్తున్న జనాలు
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో విభిన్నమైన కథాంశంతో రూపొందే డ్రామా సిరీస్లకు విశేష ఆదరణ లభిస్తోంది. రోటీన్ కథలకు భిన్నంగా కొన్ని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా ఇటీవల 'జియోహాట్స్టార్' వేదికగా విడుదలైన హిందీ వెబ్ సిరీస్ ‘ఠుక్రా కే మేరా ప్యార్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్లో నిలిచింది. శ్రద్ధా పాసీ జైరాత్ దర్శకత్వంలో, బొంబాయి షో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్.. చిన్న పట్టణ నేపథ్యం, కుల-వర్గ వ్యత్యాసాలు , ప్రేమలో మోసపోయిన యువకుడి ప్రతీకారాన్ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించబడింది. ఈ కథ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ అనే చిన్న పట్టణంలో సాగుతుంది. పేద వర్గానికి చెందిన కుల్దీప్ (ధవళ్ ఠాకూర్) అనే యువకుడు, ధనిక , రాజకీయంగా ప్రభావవంతమైన కుటుంబానికి చెందిన శాన్విక (సంచితా బసు) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వారిద్దరి మధ్య చిగురించిన ఆత్మీయత, సామాజిక అడ్డంకులు , కుల పట్టింపుల వల్ల పెద్ద ఘర్షణకు దారితీస్తుంది. శాన్విక కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అనూహ్యంగా జరిగిన కొన్ని సంఘటనల వల్ల కుల్దీప్ తీవ్రమైన అవమానాలకు, మోసానికి గురవుతాడు. ప్రేమించిన అమ్మాయి నుంచే ఎదురైన తిరస్కారం వల్ల అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది? ఆ తర్వాత కుల్దీప్ IAS/రాజకీయ అధికారంతో తిరిగి వచ్చి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే ఈ సిరీస్ ముఖ్యమైన ఇతివృత్తం. ఈ సిరీస్ ద్వారా నటుడు మృణాల్ ఠాకూర్ సోదరుడు ధవళ్ ఠాకూర్ డిజిటల్ రంగానికి పరిచయమయ్యాడు. కుల్దీప్ పాత్రలో అమాయకమైన ప్రేమికుడిగా, ఆపై ప్రతికారేచ్ఛతో రగిలిపోయే యువకుడిగా ధవళ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. సంచితా బసు శాన్విక పాత్రలో ఎంతో గ్లామరస్గానూ, భావోద్వేగాల మేళవింపుతోనూ సహజంగా నటించింది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకాదరణ పొందింది. అలాగే అనిరుద్ధ్ దేవ్, గోవింద్ పాండే, సుశీల్ పాండే వంటి సీనియర్ నటులు తమ సహాయక పాత్రలలో ఒదిగిపోయారు. ఉత్తర భారత రూరల్