
కొత్త టెక్నాలజీ.. కొత్త ఎక్స్ పీరియెన్స్ .. ఆ కిక్కే వేరప్ప
రోజులు మారుతున్నాయి.. టెక్నాలజీ పెరుగుతోంది.. పేక్షకుల అభిరుచి, ఆలోచన రెండూ మారుతున్నాయి.. చేసే పనిలోనే కాదు.. ఎంజాయ్‌మెంట్‌లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు.. ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చేది సినిమా.. ఒకప్పటి సినిమా థియేటర్ అనుభూతికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా ప్రేక్షకుడు కూడా ఎట్రాక్షన్, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకుంటున్నాడు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ హవా తగ్గింది. అంతా మల్టీప్లెక్స్ మాయాజాలమే నడుస్తోంది. పైగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం పెద్ద సవాల్‌గా మారింది. ఓటీటీ రూపంలో ఇంట్లోనే మినీ హోమ్ థియేటర్ ఉన్నప్పుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అయితే సినిమాకు క్రేజ్ ఉండాలి. సినిమాకు కథ, కథనం, ఆర్టిస్టులు ఎంత ముఖ్యమో.. సరికొత్త అనుభూతి కూడా అంతే ముఖ్యం. హాల్లో సినిమా చూస్తున్నామనే భావన కంటే ఆ కథలో మనం కూడా భాగమయ్యే అనుభూతి కోసమే ఆరాటపడుతున్నారు సినీ లవర్స్. ఆ అనుభూతి పంచే దిశగా కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఈ తరహా టెక్నాలజీ ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఐమ్యాక్స్, ఐమ్యాక్స్ విత్ లేజర్, స్క్రీన్‌ఎక్స్, 4Dx తదితర స్క్రీన్ ఫార్మాట్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. మరి ఆయా ఫార్మాట్ల ప్రత్యేకతలేంటో చూద్దామా.. ఐమాక్స్ ఫార్మెట్: మామూలు 35 ఎంఎం, 70ఎంఎం థియేటర్ స్క్రీన్స్ తో పోలిస్తే ఇది చాలా పెద్ద తెర. నయా ప్రొజెక్షన్ మెషినరీ, వినూత్నరీతిలో సౌండ్ సిస్టమ్ ఐమాక్స్ ప్రత్యేకత. ముఖ్యంగా యాక్షన్, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగే చిత్రాలను ఐమాక్స్‌లో చూస్తే ఆ థ్రిల్లే వేరు. దీంతో సినిమాలో ప్రపంచంలోకి ప్రేక్షకుడు మరింతగా లీనమయ్యే అవకాశం ఉంటుంది. ఐమ్యాక్స్ విత్ లేజర్: ఐమాక్స్‌లో లేజర్ స్క్రీనింగ్.. ఇదొక ప్రీమియం అనుభూతిని అందించేది. ఇందులో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. సాధారణ ప్రొజెక్షన్‌తో పోలిస్తే మరింత లైటింగ్, స్పష్టమైన చిత్రాలను