
రివ్యూ
సినిమా పేరు: లెనిన్ (LENIN) నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, ప్రమోద్ పంజు, తదితరులు. దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బురు సంగీతం: ఎస్. థమన్ నిర్మాతృత్వం: అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కథ : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉండే శ్రీరాంపురం అనే ఒక పల్లెటూరు చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ఊరిలో ప్రతి ఏటా చాలా గ్రాండ్‌గా జరిగే ద్రౌపది అమ్మవారి 'భారతం జాతర' అంటే ఊరి జనాలకి ఒక పెద్ద పండుగ. ఊరి పెద్దల ఆధ్వర్యంలో వారాల తరబడి జరిగే ఈ జాతర వెనుక ఒక బలమైన సెంటిమెంట్, నమ్మకం దాగుంటాయి. అలాంటి ఊరిలోకి 1976వ సంవత్సరంలో ఒక చిన్న అబ్బాయి అడుగుపెడతాడు. ఆ అబ్బాయే మన హీరో లెనిన్. అనాథగా వచ్చిన ఆ పిల్లోడిని ఊరి ప్రెసిడెంట్ ఫ్యామిలీ చేరదీసి సొంత బిడ్డలా పెంచుతుంది. ఆ ఇంట్లోని పెద్ద కొడుకు వసంతే మన లెనిన్‌కు ప్రాణ స్నేహితుడు అవుతాడు. అదే ఊరిలో ఉండే మరో పెద్ద ఫ్యామిలీ అమ్మాయి భాగ్యశ్రీ కూడా వీళ్ల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగం అవుతుంది. మొదట్లో అంతా నార్మల్ పల్లెటూరి వాతావరణం, ఇద్దరు దోస్తుల మధ్య తిరిగే ఎమోషన్స్, ఒక క్యూట్ లవ్ స్టోరీ లాగే కథ సాగుతుంది. కానీ, కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ శ్రీరాంపురం ఊరి జాతర వెనుక, అక్కడి ఫ్యామిలీల మధ్య ఉండే పగలు, ప్రతీకారాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక ఊహించని మలుపు ఈ కథను పూర్తిగా ఒక సీరియస్ మోడ్‌లోకి మార్చేస్తుంది. అసలు మన లెనిన్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ జరిగిన పెళ్లి ట్విస్ట్ ఏంటి? జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత లెనిన్ తన ఊరి కోసం, తను నమ్మిన వాళ్ల కోసం ఏం చేశాడు? శ్రీరాంపురం జాతరకు, మహాభారత కథకు ఉన్న