


శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్‌గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది. తొలి బ్యాటర్‌గా రికార్డు పడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్‌ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్‌పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డులెక్కాడు. పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ
భారత పురుషుల క్రికెట్ జట్టు కొన్నాళ్లుగా స్లో, టర్నింగ్ పిచ్‌లపై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ లంక స్పిన్నర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. తొలి రోజు ఆటలో పడిక్కల్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 131 పరుగులు) క్రీజులో అడుగుపెట్టిన మొదటి బంతినే బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు.ఈ మ్యాచ్‌లో ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో పడిక్కల్ క్రీజు వదిలి ముందుకు వచ్చి లాంగాన్ మీదుగా కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. యంగ్ బ్యాటర్ కనబరుస్తున్న ఆత్మవిశ్వాసం చూస్తుంటే అతడు తన తొలి టెస్ట్ శతకాన్ని భారీ డబుల్ సెంచరీగా మలిచేలా స్పష్టంగా కనిపిస్తోంది. టర్నింగ్ పిచ్‌లపై కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్ చక్కగా డిఫెన్స్ చేశాడు. అంతేకాకుండా గ్యాప్‌లలో సింగిల్స్ తీస్తూ ఫ్రంట్‌ఫుట్, బ్యాక్‌ఫుట్ రెండింటిపైనా అద్భుతమైన షాట్లు ఆడుతూ అలరించాడు.ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ .. పడిక్కల్ ఆటతీరును ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఎదుర్కొంటున్న స్పిన్ సమస్యకు దేవదత్ పడిక్కల్ రూపంలో పర్ఫెక్ట్ సమాధానం దొరికిందని, అతడు జట్టుకు దేవుడిచ్చిన వరం అని అభిప్రాయపడ్డాడు. స్పిన్‌కు అనుకూలించే ఆసియా పిచ్‌లపై స్పిన్నర్ల తలమీదుగా సునాయాసంగా షాట్లు ఆడగల సామర్థ్యం పడిక్కల్ సొంతమని ఆయన కొనియాడాడు.ఇదే సమయంలో టీమ్ మేనేజ్మెంట్కు మంజ్రేకర్ ఒక ముఖ్యమైన సూచన చేశాడు. భవిష్యత్తులో సాయి సుదర్శన్ జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, స్పిన్ బౌలింగ్‌ను ఇంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్న దేవదత్ పడిక్కల్‌నే మూడో స్థానంలో నిలకడగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశాడు. పడిక్కల్ ఆడుతున్న తీరు భారత ఇన్నింగ్స్‌కు కొండంత బలాన్ని ఇస్తుందని, రాబోయే రోజుల్లో అతడు టెస్టుల్లో మరింత కీలక పాత్ర పోషిస్తాడని మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా భారత్ తరఫున మూడో టెస్టు

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 134 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను పడిక్కల్ అందుకున్నాడు. ఈ క్రమంలో పడిక్కల్ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు టెస్ట్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. పడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్‌ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్‌పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డులెక్కాడు. పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ చేతి వాటం బ్యాటర్‌గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో కదం తొక్కాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన పడిక్కల్ (131 నాటౌట్), తన కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అతనికి తోడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (77 రిటైర్డ్ హర్ట్) కూడా రాణించడంతో, శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వెలుతురు లేమి, వర్షం కారణంగా ఆటను ముందుగానే నిలిపివేసే సమయానికి టీమిండియా 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (32), కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. అయితే, జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్, రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, తీవ్రమైన కండరాల నొప్పితో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్, లభించిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. క్రీజును చక్కగా ఉపయోగించుకుంటూ, అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో లంక బౌలర్లను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బ్యాక్ ఫుట్‌పై ఆకట్టుకునే షాట్లు ఆడాడు. 134 బంతుల్లో తన తొలి టెస్ట్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 2002లో సౌరవ్ గంగూలీ తర్వాత భారత జట్టులో మూడో స్థానంలో టెస్టు శతకం
