
నిమిషం•Telangana•11 ఆగ
రేరా అనుమతి పొందినట్రంప్ టవర్స్
Hyderabad: అత్యంత ఖరీదైన 450 ఫ్లాట్లు: రేరా అనుమతి పొందిన ట్రంప్ టవర్స్ హైదరాబాద్: నగరంలోని కోకాపేటలో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. 65 అంతస్తులతో రెండు టవర్ల నిర్మాణం జరగనుంది. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా వీటి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. ఈ టవర్లలో అతి ఖరీదైన 450 ఫ్లాట్లు ఉండనున్నాయి. ట్రంప్ టవర్స్‌కు ఇప్పటికే రెరా అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్న ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు వెల్లడించాయి