
వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. ఇప్పటికైనా అతడిని రంగంలోకి దింపడయ్యా సామీ
Sunil Gavaskar Comments Team India Opener Sanju Samson: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయినప్పటికీ, టీమిండియా ఓపెనింగ్ స్థానంపై సరికొత్త వివాదం రాజుకుంది. వరుసగా విఫలమవుతున్న సంజూ శాంసన్ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమ్ మేనేజ్మెంట్ను గట్టిగా డిమాండ్ చేశారు. భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారత ఇన్నింగ్స్ సాగుతున్నంత సేపు పడుతూ ఆగుతూ ఇబ్బంది పెట్టిన వర్షం, ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మరింత ఉధృతంగా మారింది. ఎంతసేపటికీ వాన తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరుగుల వరద పారే మ్యాచ్‌ను చూద్దామనుకున్న అభిమానులకు వర్షం తీవ్ర నిరాశను మిగిల్చింది. భారత ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదైనప్పటికీ, ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ మరోసారి చేతులెత్తేశాడు. ఇప్పటికే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సంజూ, ఇంగ్లాండ్‌పై కూడా అదే పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 7 బంతులను ఎదుర్కొని, కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తన స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా, సంజూ బాధ్యతారాహిత్యంగా ఆడటంపై అభిమానులు, మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక మ్యాచ్‌లో ఆడితే, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో విఫలమవ్వడం సంజూకు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంగంలోకి సునీల్ గావస్కర్.. గంభీర్ నిర్ణయాలపై ప్రశ్నలు..! సంజూ శాంసన్ వరుస వైఫల్యాల నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్