నిమిషం•Politics•15 సెప్టెం
న్యూయార్క్ సబ్వేలో ఘోర ప్రమాదం: రైలు కిందపడి భారత సంతతి యువతి, ఆమె స్నేహితుడు మృతి.. వీడియో వైరల్
న్యూయార్క్ లోయర్ మన్హ్యాటన్లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో రైలు కిందపడి భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24), నేపాల్ సంతతి నవమ్ కౌల్ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలపై పడిన స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. రూట్జర్స్ యూనివర్సిటీలో కలిసి చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన ఈ ఇద్దరు యువతీయువకులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది.